Home Filmy Adda తెలుగు రాష్ట్రాల నుండి టెక్సాస్‌ లోని లమర్ యూనివర్సిటీ వరకు వెళ్లిన బాలయ్య పాట.. వీడియో వైరల్..!

తెలుగు రాష్ట్రాల నుండి టెక్సాస్‌ లోని లమర్ యూనివర్సిటీ వరకు వెళ్లిన బాలయ్య పాట.. వీడియో వైరల్..!

by Megha Varna

ఇటీవలే అఖండ చిత్రంతో భారీ సక్సెస్ సాధించారు బాలకృష్ణ. బాలకృష్ణ నటించిన ప్రాజెక్టుగా ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం NBK 107. ఇది బాలకృష్ణ 107 వ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది.

ఇదిలా ఉంటే బాలయ్య పైసా వసూల్ సినిమా కూడా చేసారు. ఈ విషయం మనకు తెలిసిందే. ‘పైసా వసూల్’ ద్వారా మంచి ఫేమ్ ని కూడా బాలయ్య పొందారు.

ఈ సినిమా టైటిల్ సాంగ్ కూడా బాగా ఫేమస్ అయ్యింది. ”వసూల్ వసూల్ వసూల్ వసూల్ పైసా వసూల్ అంటూ” స్టెప్పులతో ఇరగతీసాడు బాలయ్య. పైసా వసూల్ పాట లో కైరా దత్‌ కూడా చిందులేసింది. పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శ్రియ శరణ్ బాలయ్య సరసన నటించారు. అనుప్ రూబెన్స్ పాటలని అందించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని పొంద లేక పోయింది.

కానీ ఈ పాట ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుండి టెక్సాస్‌ లోని లమర్ యూనివర్సిటీ వరకు చేరింది. ఆ యూనివర్సిటీ లో చదువుతున్న కొందరు తెలుగు విద్యార్థులు అక్కడ ప్రొఫెసర్ కి పాటలని పరిచయం చేయగా ఆయనకి పైసా వసూల్ పాట నచ్చేయడంతో… ఆ పాట లిరిక్స్ నేర్చుకుని క్లాస్ రూము లో విద్యార్థుల ముందు పడ్డారట. ఈ వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌ అయ్యింది. టెక్సాస్ వరకూ బాలయ్య పాట చేరిందని అభిమానులు సంతోషిస్తున్నారు.

balayya- gopichnad movie have same plot like his akhanda..

ఇదిలా ఉంటే అంతా NBK 108 సినిమా వివరాలను చూస్తే… ఈ చిత్రంలో శాండిల్ వుడ్ హీరో దునియా ఫేమ్ విజయ్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల అయ్యిపోయింది. అలానే బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో యాక్షన్ ఉంటుందిట. ఎమోషన్స్ కూడా ఎక్కువ వుంటాయని టాక్. అలానే సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉండనుంది. వర లక్ష్మి శరత్ కుమార్ బాలయ్య సోదరిగా నటించనుంది.

 

You may also like