Ads
హీరోయిన్ ఎంగేజ్మెంట్ సీన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ తండ్రి ఫ్రెండ్ కొడుకైన మన హీరో కూడా హీరోయిన్ ఇంటికి వస్తాడు. అక్కడ అవుట్ హౌస్ లో ఉంటూ కామెడీ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఉద్యోగం వస్తుంది. ఇలా సాగుతుండగా అనుకోకుండా హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. కానీ తండ్రికి ఇచ్చిన మాటకోసం ఆ అమ్మాయిని ప్రేమించాలా? వద్దా? అనే కన్ఫ్యూషన్ లో పడతాడు మన హీరో.
Video Advertisement
ఈపాటికే మీకు అర్ధం అయిపోయి ఉంటుంది ఇంతసేపు మాట్లాడింది ఏ సినిమా గురించని. వెంకటేష్, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా ఎవర్ గ్రీన్ సినిమా అనే చెప్పాలి.
ఈ సినిమాని ఎన్ని సార్లు చూసినా ఏ మాత్రం బోర్ అనిపించదు. పైగా సినిమా మొత్తం మంచి కామెడీతో ఉంటుంది. విక్టరీ వెంకటేష్ యాక్షన్ తో పాటు కామెడీ కూడా చేసే కొద్ది మంది హీరోలలో ఒకరు. సరైన పాత్ర వచ్చిందంటే కామెడీ టైమింగ్ ని ఎవరు ఆపలేరు. వెంకటేష్ నటించిన సినిమాల్లో ఎన్నో సినిమాలు విజయవంతమయ్యాయి. దేవి పుత్రుడు, ప్రేమ తో రా.. వంటి సినిమాలు ప్లాప్ సినిమాలతో ఉన్న వెంకీ “నువ్వు నాకు నచ్చావ్” సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చారు.
ఈ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. వెంకటేష్ ఆర్తి అగర్వాల్, పింకీ, బ్రహ్మానందంతో పాటుగా వాటర్ వరల్డ్ కి వెళ్లారు. అక్కడ ఆర్తి అగర్వాల్ ని జాయింట్ వీల్ మీద వదిలేసి వెంకీ వెళ్ళి పోతాడు. అప్పుడు ఆర్తి అగర్వాల్ వెంకీ అని పిలిచి ఆఖరికి పరిగెత్తి వెంకీ ని కొడుతోంది. ఆ సీన్ ఏదో ఆలోచిస్తే వచ్చింది కాదు. ఈ హాలీవుడ్ సినిమా నుండి తీసుకు వచ్చేసారు. మరి ఆ హాలీవుడ్ సినిమా లో సీన్ ని కూడా చూసేయండి. అప్పుడు మీకే అర్ధం అవుతుంది.
https://www.instagram.com/reel/ClIHTkPp0m0/?utm_source=ig_web_button_share_sheet
End of Article