Gaalodu Collections: ‘గాలోడు’ 11 రోజుల మొత్తం కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Gaalodu Collections: ‘గాలోడు’ 11 రోజుల మొత్తం కలెక్షన్స్ ఎంతో తెలుసా?

by Sainath Gopi

Ads

Tollywood: జబర్ధస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా వచ్చిన చిత్రం ‘గాలోడు’. ఈ సినిమాతో తొలిసారి హీరోగా సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా మాస్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్. గెహ్నా సిప్పి ఈ మూవీలో హీరోయిన్‌గా నటించింది.

Video Advertisement

జబర్దస్త్,ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్స్ ద్వారా టెలివిజన్ ప్రేక్షకులకి చేరవైన సుడిగాలి సుధీర్‌కి యూత్‌లో క్రేజ్ ఉంది. ఇప్పుడు అదే సుధీర్‌కి సినిమాల్లో అవకాశాలను తీసుకొస్తుంది. సుధీర్‌ ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా చేశాడు. కానీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. తనకు ఛాన్స్ వచ్చిన ప్రతిసారి వెండితెర పై సుధీర్‌ అదృష్టాన్ని పరీక్షించుకుంటునే ఉన్నారు. అక్కడ సక్సెస్ కావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూన్న సుడిగాలి సుధీర్‌ ‘గాలోడు’ సినిమాతో హీరోగా ఫస్ట్ హిట్ అందుకున్నారు.
Sudigali-Sudheer-telugu addaఅయితే గత కొన్నేళ్లలో ఆడియెన్స్ అభిరుచుల్లో చాలా మార్పు వచ్చింది.మరి ముఖ్యంగా కరోనా తర్వాత ఆడియెన్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో చూడడానికి అలవాటు పడ్డారు. మిగతా భాషల సినిమాలు చూడడానికి అలవాడు పడ్డారు. ఈక్రమంలో పెద్ద స్టార్స్ నటించిన సినిమాలైనా కూడా కథ, కథనం బాగుందనే టాక్ వస్తే తప్ప చూడట్లేదు. అది కూడా థియేటర్స్‌లో మాత్రమే చూడాల్సిన సినిమా అంటేనే థియేటర్స్‌ కు వెళ్తున్నారు. లేకపోతే ఓటీటీలో వచ్చాక చూద్దాం అని అనుకుంటున్నారు.
gaalodu-telugu-addaఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్ నటించిన సినిమాకు మొదటి రోజు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా  బాగా నమోదయ్యాయి. పెద్ద హీరోల మూవీస్ చూడటానికి పెద్దగా ఇష్టపడని ఆడియెన్స్ సుడిగాలి సుధీర్ సినిమా చూసేందుకు రావడం ఆసక్తికర విషయమే. తెలంగాణ,ఏపీలోని బీ,సీ సెంటర్స్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘గాలోడు’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.2.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.2.7 కోట్ల వరకు షేర్ ను రావాలి. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుంది. పదకొండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 4.38 కోట్ల వసూళ్లను రాబట్టింది.


End of Article

You may also like