KGF Vs కాంతార..! ఈ 2 సినిమాలు తెలుగులో హిట్ అయ్యాయి..! కానీ దేనికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి అంటే..?

KGF Vs కాంతార..! ఈ 2 సినిమాలు తెలుగులో హిట్ అయ్యాయి..! కానీ దేనికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి అంటే..?

by kavitha

Ads

కన్నడ సినిమా కాంతార బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో కూడా విజయవంతంగా  దూసుకుపోతుంది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఊహించని కలెక్షన్స్ రాబడుతుంది.

Video Advertisement

కన్నడలో తక్కువ బడ్జెట్‏ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కొత్త రికార్డ్ నమోదు చేసింది. 50రోజులు దాటిన కూడా థియేటర్లలో సత్తా చాటుతుంది. అయితే ఈ సినిమా తాజాగా కేజీఎఫ్ 2 రికార్డ్ ను బ్రేక్ చేసింది. వరల్డ్ వైడ్ గా  ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మొదట సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైంది. ఇతర భాషా ప్రేక్షకుల నుంచి డిమాండ్ రావడంతో వాటిలో డబ్ చేసి విడుదల చేశారు. అయితే ఈ సినిమాకి విడుదలైన అన్ని భాషల్లో మంచి ప్రశంసలు అందుకుంది.
kgf-chapter-2 telugu addaకన్నడ చిత్రాలు పాన్ ఇండియా వైడ్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. ‘కేజీయఫ్‌’తో రాకీభాయ్‌ దేశాన్నిషేక్‌ చేశాడు.‘కేజీయఫ్‌’  హిట్‌ ఒక ఎత్తైతే, ఆ తరువాత వచ్చిన ‘కేజీయఫ్‌ 2’ మరో లెవెల్. ఇక దీంతో కన్నడ సినీ పరిశ్రమ వెలిగిపోతోంది. అయితే  తాజాగా ‘కేజీయఫ్‌’ రికార్డు ను కాంతార దాటేసింది. అయితే ఇక్కడ ఒక సందేహం రాకమానదు. ఎందుకంటే ‘కేజీయఫ్‌ 2’మూవీ  వరల్డ్ వైడ్ గా రూ. 1250 కోట్లు సాధించింది.  అయితే ఇక్కడ  చెప్పేది  కర్ణాటక రాష్ట్రంలోని కలెక్షన్స్ గురించి మాత్రమే.‘కేజీయఫ్‌ 2’మూవీ  రూ.172 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వ‌సూలు చేసింది.
kantara 1 telugu addaతాజాగా  ఆ కలెక్షన్స్ ను ‘కాంతార’ 60 రోజుల్లోనే క్రాస్‌ దాటేసిందట. ఇక దీంతో కన్నడ ఇండస్ట్రీలో ‘కాంతార’ మూవీనే టాప్‌. అయితే రెండు సినిమాలకు మ‌ధ్య చాలా తేడాలు ఉన్నాయి. కేజీయఫ్‌ 2 బ‌డ్జెట్ రూ. వంద‌ల కోట్ల‌లో ఉంటే, ‘కాంతార’ బడ్జెట్‌ రూ.16కోట్లు. క‌థనే నమ్ముకుని ‘కాంతార‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ రెండు సినిమాలను నిర్మించింది  హోంబలే ఫిల్మ్స్‌.


End of Article

You may also like