Ads
Samantha: సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే ఆమె యశోద సినిమాతో వచ్చి డీసెంట్ హిట్ పొందింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన యశోద సినిమాకి తొలిరోజే పాజిటివ్ టాక్ వచ్చింది.
Video Advertisement
సమంత మార్కెట్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబట్టి ఈ చిత్ర నిర్మాతకు లాభాలను తెచ్చింది. కొన్ని రోజుల నుంచి సమంత గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మళ్లీ అనారోగ్యం పాలైందని, చికిత్స తీసుకుంటుందని, కేరళలో ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటుందని, అది కాదు ఆమెని దక్షిణ కొరియాకి తీసుకువెళుతున్నారని, ఇలా రకరకాలుగా ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. కాగా ఈ వార్తల పై ఆమె పిఆర్ టీం స్పందిస్తూ అలాంటిది ఏం లేదని చెబుతూ వస్తోంది. ఇక తాజాగా సమంత సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది అడవి శేషు హీరోగా హిట్ 2 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నేచురల్ స్టార్ నాని మరియు ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ మూవీకి శైలేష్ కొలను డైరెక్టర్. డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఒక జర్నలిస్ట్ హిట్ సిరీస్ మూవీస్ లో సమంత లాంటి స్ట్రాంగ్ ఫిమేల్ విలన్ గా చేస్తే బావుంటుండి అని ట్వీట్ చేసాడు. అయితే దీనిని అడవి శేషు రీ ట్వీట్ చేయడమే కాక, ఇది అద్భుతమైన ఆలోచన సమంత ఏమంటావ్ అని సమంతను అడిగాడు. దానికి సమంత సమాధానంగా బాడ్ యాస్ కాప్,ఇది వినడానికి చాలా ఫన్నీగా ఉంది అని కామెంట్ పెట్టింది.అంతేకాక నీ సినిమా హిట్టు అయినందుకు కంగ్రాట్స్, నిన్ను ఎప్పటికీ చీర్ చేస్తూనే ఉంటా అని కామెంట్ చేసింది. అయితే సమంత హిట్ సిరీస్ లో నటించే అవకాశాలు ఉన్నాయని హింట్ ఇచ్చేసింది. ఇంకో వైపు సమంత అభిమానులు ఆమె ట్వీట్ చేసిందంటే అనారోగ్యంతో లేదని, బాగానే ఉందని సంతోషపడుతున్నారు. ఇది ఇలా ఉంటే, హిట్ సిరీస్ను 8 భాగాలుగా రూపొందించాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. హిట్ 2 ప్రమోషన్స్ లోనే 3వ పార్ట్ గురించి తెలిపారు. అయితే హిట్ 3 లో నాని హీరోగా, కీలక పాత్రలో అడివి శేష్ నటిస్తాడని తెలిపారు.
End of Article