Ads
Shriya – Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి డెడికేషన్‌కు పెట్టింది పేరు. తన సినిమాలోని ప్రతీ సీన్ ని శిల్పాన్ని చెక్కినట్లుగా చెక్కుతాడు అందుకే జక్కన్న అని పిలుస్తారు. రాజమౌళి పర్‌ఫెక్షన్ కోసం ఎంతో పరితపిస్తుంటారు.
Video Advertisement
ఆయన సినిమా చూసేటప్పుడు స్క్రీన్ పై కనిపించే ప్రతీ సన్నివేశంలోను రాజమౌళి పడ్డ తపన, కష్టం కనిపిస్తుంది. జక్కన్న సినిమా కోసం ఎంతగా కష్టపడుతాడు అనే దానికి హీరోయిన్ శ్రియా చెప్పిన ఓ సంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. హీరోయిన్ శ్రియా మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలిపింది. RRR మూవీ షూటింగ్ టైమ్ లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తూ, ‘RRR సినిమా మొదలు పెట్టకముందు రాజమౌళి గారికి ఆస్తమా వచ్చింది. అయితే ఆయన దాని గురించి పట్టించుకోకుండా, దృష్టంతా షూటింగ్ పైనే పెట్టారు. ఆయన ఎప్పుడు ఆడియెన్స్ కి కథను గొప్పగా చూపించాలనే ఆలోచించారు. షూటింగ్ లో చాలా దుమ్ము ఉన్నా కూడా పని చేస్తూనే ఉన్నారు. ఆయన మూవీ అద్భుతంగా ఉండాలని ఎల్లప్పుడూ తాపత్రయపడతారు’ అని తెలిపారు. ఇక RRR మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డ్స్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి తెలుగు సినిమా స్టామినాని చాటి చెప్పింది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం నమోదు చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన, రాజమౌళి దర్శకత్వం సినిమాకు విజయాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, అలియా భట్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ, ఆస్కార్ బరిలో కూడా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి గానూ దర్శక ధీరుడు రాజమౌళికి ఉత్తమ డైరెక్టర్ గా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు వచ్చింది. ఇండియా తరపున ఈ అవార్డు పొందిన తొలి డైరెక్టర్ రాజమౌళి అవడం విశేషం.
End of Article