Ads
కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ హీరోగాగా నటిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘వారసుడు’ (వారిసు). వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్, పరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రానున్న సంక్రాంతికి మూవీ తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున్న రిలీజ్ కానుంది. ఈ చిత్రం లో విజయ్ సరసన రష్మిక నటిస్తోంది.
Video Advertisement
ఈ సినిమా నుంచి తమిళంలో ఇటీవల రంజితమే అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో ఇప్పటికే 75 మిలియన్ వ్యూస్‌ను సినిమా సంపాదించుకుంది. కాగా ఇపుడు టాలీవుడ్ ప్రేక్షకుల కోసం తెలుగు వెర్షన్‌ను విడుదల చేశారు మేకర్స్. ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి పాడారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాశారు. తెలుగు వెర్షన్ కూడా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమైనట్టే తాజా సాంగ్‌తో అర్థమవుతుంది.
అయితే తాజాగా విడుదలైన లిరికల్ సాంగ్ లో విజయ్, రష్మిక ఫాస్ట్ బీట్ కి డాన్స్ లతో దుమ్ము రేపారు. అయితే ఈ సాంగ్ కి డాన్స్ చేస్తున్న సమయం లో రష్మిక కుడి కాలి పట్టీ ఊడిపోయింది. అయినా రష్మిక అలానే డాన్స్ చేసింది. అది చూసుకోకుండా మేకర్స్ సాంగ్ రిలీజ్ చేసారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పట్టీ ఊడిపోయింది కదమ్మా.. చూసుకోవాలిగా.. అంటూ ఈ వీడియో కి ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
ఈ చిత్రం లో ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్, జయసుధ, ఖుష్బూ సుందర్ కీలక రోల్స్ పోషిస్తున్నారు. వారిసు సినిమా పూర్తి చేసిన తర్వాత, దళపతి విజయ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో పని చేయనున్నారు. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కనుంది.
watch video:
End of Article