Mahesh Babu: మహేష్ బాబు పై విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్..!

Mahesh Babu: మహేష్ బాబు పై విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్..!

by kavitha

Ads

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. తెలుగు చిత్రసీమలో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నారు. అంతే కాక వరుస విజయాలతో ముందుకెళ్తున్నారు. ఇటీవలే సర్కారువారి పాట మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు సూపర్ స్టార్.

Video Advertisement

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. గతంలో వీరి కాంబోలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ తో ఆడియెన్స్ ను అలరించడానికి సిద్ధం అవుతున్నారు మహేష్ బాబు, త్రివిక్రమ్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. SSMB28 వర్కింగ్ టైటిల్. మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు. కాగా, మహేష్ కుటుంబంలో నెలకొన్న వరుస విషాదాలతో ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే మహేష్ బాబు షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు.Vijayendra-Prasad-mahesh-babu-1-telugu-addaఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో మూవీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పటికే మహేష్, రాజమౌళి సినిమా పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. జక్కన్న మహేష్ తో ఓ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నారు. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ సినిమా కథను రెడీ చేస్తున్నారు. ఈ సినిమా ఆఫ్రికా అడవి నేపథ్యంలో సాగుతుందని టాక్. రాజమౌళి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియానా జోన్స్ తరహాలో మహేష్ మూవీ ఉంటుందని చెప్పారు.తాజాగా రచయిత విజయేంద్ర ప్రసాద్ మహేష్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. విజయేంద్ర ప్రసాద్ గురించి చెప్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటెన్స్ ఉన్న నటుడు. మహేష్ నటించిన యాక్షన్ సన్నివేశాలు చూసినప్పుడు చాలా ఇంటెన్సిటి కనిపిస్తుంది అని అన్నారు . ఆయన ఇంటెన్స్ వల్ల ఏ రచయితకైనా తన పని ఈజీ అవుతుంది. చాలా మంది రచయితలు మహేష్ గురించి అదే చెప్తారు అని అన్నారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు.


End of Article

You may also like