Ads
ప్రముఖ హీరో నందమూరి తారకరత్న అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తారకరత్నకి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు మీడియా ముందు చెప్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులకు కూడా తారకరత్నని చూడటానికి ఆసుపత్రికి వెళుతున్నారు.
Video Advertisement
తారకరత్నకి మెలెనా అనే ఒక అరుదైన వ్యాధి ఉంది అని చెప్పారు. జీర్ణాశయాంతర రక్తస్రావాన్ని మెలెనా అని అంటారు. ఎగువ జీర్ణాశయాంతర మార్గం దెబ్బతింటుంది. కడుపులో రక్తనాళాలు వాపు, రక్తస్రావం ఇలాంటి లక్షణాలు ఉంటాయి.
దీనివల్ల శరీరంలో రక్త స్థాయి తగ్గుతుంది. మనిషి చాలా బలహీనంగా అయిపోతారు. చాలా సార్లు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. తొందరగా అలిసిపోవడం, విపరీతంగా చెమటలు రావడం, ఉన్నట్లుండి అక్కడే కుప్పకూలి పడిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి జరుగుతాయి. రక్తం తక్కువగా అయిపోయిన తర్వాత అజీర్తి, రక్తపు వాంతులు అవుతాయి. దీనివల్ల చాలా సార్లు విపరీతంగా రక్తస్రావం అవుతూ ఉంటుంది.
ముక్కులు, చెవుల నుండి కూడా రక్తం కారుతుంది. ఈ రక్తస్రావం కారణంగా గుండెకి వైద్యం అందించడంలో కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి. ఈ కారణంగానే కృత్రిమ గుండె కదలిక కోసం ఎక్మో ఇంప్లాంటేషన్ అనేది చేస్తారు. తారకరత్న కి చికిత్స అందిస్తున్న సమయంలో గుండె నాళాల్లోకి రక్తప్రసరణ కావడం కష్టంగా మారింది. అందుకే బెలూన్ యాంజియోప్లాస్టీ సహాయంతో రక్తాన్ని పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వైద్యులు కూడా ఎన్నో రకాలుగా తారకరత్నకి చికిత్స అందిస్తున్నారు.
End of Article