Ads
బ్రహ్మానందం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఆ పేరు చెబితే చాలు… పెదవులపై చిరునవ్వు వచ్చేస్తుంది. ఆ ఇమేజ్ అటువంటిది. ఒకటా.. రెండా.. వెయ్యికి పైగా సినిమాలు చేశారు. వందల పాత్రలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. బ్రహ్మానందం పేరు లేకుండా తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పలేం. ఆయనకంటూ సపరేట్ అధ్యాయం ఉంటుంది.
Video Advertisement
‘అహ నా పెళ్ళంట’లో అరగుండు క్యారెక్టర్ నుంచి మొదలు పెడితే ఇటీవల వచ్చిన ‘జాతిరత్నాలు’ చిత్రం వరకు ఎన్నో అద్భుతమైన పాత్రలు ఆయన ఖాతాలో ఉన్నాయి. కేవలం ఆయన కామెడీ కొన్ని సినిమాలను విజయ తీరాలకు చేర్చిందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు వయోభారం కారణంగా బ్రహ్మానందం సినిమాలను కాస్త తగ్గించాడు. కానీ ఒకప్పుడు బ్రహ్మానందం లేకుండా ఒక్క సినిమా కూడా వచ్చేది కాదు.
స్టార్ హీరోల సినిమాలకు బ్రహ్మానందం ఆయువు పట్టులా ఉండేవాడు. బ్రహ్మి కోసం ప్రత్యేకంగా ట్రాక్ లు రాసుకునేవారు దర్శకులు. రామ్ రెడీ అయినా మహేష్ బాబు దూకుడు, ఆగడు అయినా, ఎన్టీఆర్ అదుర్స్ సినిమా అయినా కూడా బ్రహ్మానందమే పస్ల్ పాయింట్. నటనే కాకుండా బ్రహ్మానందంలో ఒక హిడెన్ టాలెంట్ ఉంది. ఆయన గొప్ప చిత్రకారుడు. ఆయన గీసే దేవుడి బొమ్మ పటాలకు మంచి గిరాకీ ఉంటుంది. ఆయన కరోనా సమయంలో దేవుడి చిత్ర పటాలను గీయడం ద్వారా ఆయన టాలెంట్ ప్రపంచానికి తెలిసింది. వాటిని సెలెబ్రిటీలకు గిఫ్ట్‌గా ఇస్తుండేవాడు.
కామెడీ యాంగిల్ కాకుండా కరుణరసం కూడా అలవోకగా పండిస్తాడు బ్రహ్మి. సినిమాల్లో తన అద్భుత నటనకు గాను ఇప్పటికి ఆరు సార్లు నంది అవార్డు గెలుచుకున్నాడు బ్రహ్మానందం. అయితే బ్రహ్మానందం సినిమాలు తగ్గించినా.. సోషల్ మీడియాలో బ్రహ్మానందంని కనబడని రోజంటూ ఉండదు. ఏ జిఫ్ ఫైల్ చూసినా కూడా బ్రహ్మానందం కనిపిస్తాడు. ఏ మీమ్ చూసినా బ్రహ్మానందం కనిపిస్తాడు. ఏ ట్రోల్ వీడియోలో చూసినా బ్రహ్మానందమే కనిపిస్తాడు. ఒక ఇంటర్వ్యూ లో ఆయన దీనిపై స్పందించారు. ”మీమ్స్ క్రియేట్ చేసే వాళ్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. కొన్ని కారణాల వల్ల నేను సినిమాల్లో నటించకపోయినా..ప్రజలు నన్ను మర్చిపోకుండా చేసేది వాళ్ళే” అని చేతులెత్తి దణ్ణం పెట్టారు బ్రహ్మి.
అలాంటి కామెడీ బ్రహ్మ, జిఫ్ గాడ్, మీమ్స్ దేవుడు, ట్రోల్స్ రారాజు బ్రహ్మానందం పుట్టిన రోజు ఈ రోజు.. ఈ సందర్భంగా నెట్టింట కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article