Ads
సాధారణంగా సెలబ్రిటీలకి సంబంధించిన ఏ విషయం అయినా సరే సామాన్య ప్రజలకి తెలియకుండా ఉండదు. అది ఎంత వ్యక్తిగత విషయమైనా సరే ఏదో ఒక సందర్భంలో అందరికీ తప్పకుండా తెలుస్తుంది.
Video Advertisement
కొంత మంది వారి వ్యక్తిగత విషయాల గురించి వారే బయటికి చెప్తారు. కానీ మరి కొంత మంది మాత్రం ఎంత జాగ్రత్తగా విషయాన్ని దాచాలని ప్రయత్నించినా కూడా ఏదో ఒక రకంగా అది బయటికి వచ్చేస్తూనే ఉంటుంది. అలా సెలబ్రిటీల జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు బయటకి వచ్చాయి. ఈ విషయాలకి కొంత మంది సెలబ్రిటీలు స్పందించి వారి అభిప్రాయాన్ని తెలిపితే మరి కొంత మంది మాత్రం అసలు వాటి గురించి మాట్లాడడానికి కూడా ఆసక్తి చూపరు.

ఈ రకంగానే సెలబ్రిటీల రిలేషన్ షిప్ కి సంబంధించిన విషయాలు కూడా బయటికి వచ్చాయి. ఇందులో కొంత మంది రిలేషన్ షిప్ లో విఫలం అయిన విషయం కూడా జనాలకి తెలిసిపోయింది. ఆ సెలబ్రిటీల్లో కొందరు వారి రిలేషన్ షిప్ గురించి వారే బయటికి చెప్తే, మరి కొంత మంది మాత్రం చెప్పకపోయినా తెలిసిపోయింది. అలా ప్రేమలో విఫలం అయిన సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 అఖిల్ అక్కినేని
హీరో అఖిల్ అక్కినేని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే శ్రేయ భూపాల్ తో ప్రేమలో పడ్డారు. ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ తర్వాత వారిద్దరూ విడిపోయారు.

#2 కత్రినా కైఫ్
హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా సల్మాన్ ఖాన్ తో ప్రేమలో ఉన్నారు. కానీ తర్వాత వారిద్దరూ విడిపోయారు.

#3 రష్మిక మందన్న
హీరోయిన్ రష్మిక మందన్న, రక్షిత్ శెట్టి ప్రేమలో ఉన్నారు. కానీ తర్వాత వారిద్దరూ విడిపోయినట్టు ప్రకటించారు.

#4 విశ్వక్ సేన్
హీరో విశ్వక్ సేన్ కూడా తనకి బ్రేకప్ అయినట్టు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

#5 దీపికా పదుకొనే
దీపికా పదుకొనే, రణబీర్ కపూర్ కొంతకాలం ప్రేమలో ఉన్నారు. తర్వాత వారిద్దరు విడిపోయారు. బ్రేకప్ తర్వాత దీపికా పదుకొనే ఎమోషనల్ గా చాలా బాధపడ్డారు అని చెప్పారు. విషయం గురించి దీపిక చాలా సందర్భాల్లో మాట్లాడారు.

#6 మెహరీన్
హీరోయిన్ మెహరీన్ కూడా భవ్య బిష్ణోయ్ ని ప్రేమించారు. తర్వాత వారిద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించారు.

#7 ఆర్తి అగర్వాల్
హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ప్రేమలో ఉన్నారు అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత విడిపోయారు అని అన్నారు.

#8 అడివి శేష్
హీరో అడివి శేష్ కి కూడా ఒక ప్రేమ కథ ఉన్నట్టు, తర్వాత వారు విడిపోయినట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

#9 ఇలియానా
హీరోయిన్ ఇలియానా కూడా ఆండ్రూ నీబోన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. కానీ తర్వాత వారిద్దరూ విడిపోయారు.

మీరు మాత్రమే కాకుండా హీరో శింబు, బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఇంకా ఎంతో మంది సెలబ్రిటీలు తాము ప్రేమలో విఫలం అయినట్టు ఎన్నో సందర్భాల్లో తెలిపారు. వారిలో కొంత మంది ఇప్పుడు మరొకరిని ప్రేమించడం చేస్తే ఇంకా కొంత మంది మాత్రం తమకి ప్రస్తుతం ప్రేమించడానికి టైం లేదు అని చెప్తూ ఉంటారు.
End of Article
