Sridevi Shoban Babu Review : “సంతోష్ శోభన్” నటించిన శ్రీదేవి శోభన్ బాబు అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Sridevi Shoban Babu Review : “సంతోష్ శోభన్” నటించిన శ్రీదేవి శోభన్ బాబు అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : శ్రీదేవి శోభన్ బాబు
  • నటీనటులు : సంతోష్ శోభన్, గౌరీ జి కిషన్.
  • నిర్మాత : విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల
  • దర్శకత్వం : ప్రశాంత్ కుమార్ దిమ్మల
  • సంగీతం : కమ్రాన్
  • విడుదల తేదీ : ఫిబ్రవరి 18, 2023

Sridevi shoban babu review

Video Advertisement

స్టోరీ :

సినిమా అంతా శ్రీదేవి (గౌరీ జీ కిషన్), శోభన్ బాబు (సంతోష్ శోభన్) అనే ఇద్దరి మధ్య నడుస్తుంది. శ్రీదేవి హైదరాబాద్ లో ఒక ఫ్యాషన్ డిజైనర్. తన తండ్రి (నాగబాబు) ని వారి బంధువు (రోహిణి) అవమానించింది అని తెలిసి ఆమె మీద పగ తీర్చుకోవడానికి అరకు వెళుతుంది. అక్కడ శోభన్ బాబుతో పరిచయం ఏర్పడుతుంది. వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అసలు శోభన్ బాబు ఎవరు? శ్రీదేవి తన బంధువుని కలిసిందా? వారి ప్రేమ ఇంట్లో తెలిసిందా? అసలు శ్రీదేవి తండ్రికి అవమానం జరగడానికి కారణం ఏంటి? ఇదంతా తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

sridevi shoban babu movie review

రివ్యూ : 

సంతోష్ శోభన్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనదైన స్టైల్ లో యాక్టింగ్ తో చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోల్లో మినిమం గ్యారంటీ హీరోలలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు సుస్మిత కొణిదల నిర్మించిన ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చారు. జాను సినిమాతో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించిన గౌరీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.

sridevi shoban babu movie review

సినిమా స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది. డైరెక్టర్ అనుకున్న పాయింట్ ని మొదటి నుండి చివరి వరకు డైవర్ట్ అవ్వకుండా చూపించారు. కానీ సినిమా కథనంలో కొత్తదనం లేకపోవడం వల్ల తర్వాత ఏమవుతుంది అనే ఆసక్తి ఉండదు. సినిమా అంతా తెలిసిపోతుంది. దాంతో ఒక పాయింట్ తర్వాత సినిమా క్లైమాక్స్ ఎప్పుడు వస్తుంది అని అనిపిస్తుంది.

sridevi shoban babu movie review

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. సంతోష్ శోభన్ తన పాత్రకి న్యాయం చేశారు. ఆ పాత్రకి తగ్గట్టుగా తనని తాను మార్చుకున్నారు. హీరోయిన్ గౌరీ కూడా తెలుగులో హీరోయిన్ గా మొదటి సినిమా అయినా కూడా అలా అనిపించకుండా నటించారు.

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటులు
  • లోకేషన్స్

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ కథ
  • చాలా ఫ్లాట్ గా ఉండే ఫస్ట్ హాఫ్

రేటింగ్ :

2.25/5

ట్యాగ్ లైన్ :

కథ నుండి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఏదైనా ఒక సరదాగా సాగే సినిమా చూద్దాం అనుకునే వారికి శ్రీదేవి శోభన్ బాబు సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

watch trailer :


End of Article

You may also like