Ads
భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో పెళ్ళికి పెద్ద పీట వేశారు. ప్రతి ఏడాది పెళ్లిళ్ల సీజన్ లో ప్రజల హడావిడి మాములుగా ఉండదు. వివాహ పత్రికలు ముద్రించటం నుంచి పెళ్లి సందడి మొదలవుతుంది. పెళ్లికూతురు, పెళ్లికొడుకు తమ శుభలేఖను జీవితాంతం మధుర జ్ఞాపకంగా దాచి పెట్టుకుంటారు. ఇప్పుడు ఎన్నో రకాల ముద్రణాయంత్రాలు ఉన్నాయి. ఎన్నో రకాల డిజైన్ల శుభలేఖలు అచ్చు వేయిస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం చేతిరాతతో మొదటి శుభలేఖ రాసుకుని, ముద్రించేవారు.
Video Advertisement
ప్రస్తుతం మార్కెట్ లో 10 రూపాయల నుంచి 10 వేల రూపాయల దాకా కార్డులు వున్నాయి అంటే మీరు ఇక అర్ధం చేసుకోవచ్చు. అలాగే కొందరు వివాహ పత్రికలో అచ్చువేయబడిన మేటర్ విషయంలో కూడా చాలా ఖచ్చితంగా వుంటారు. ఎక్కడ అచ్చు తప్పులు వున్నా కార్డులు అన్ని రిటన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది.అలాగే కొంతమంది తమ ముత్తాతలనుండి….నేటి తరం వరకు పేర్లను అచ్చు వేస్తూ వుంటారు. ఇందులో ఎవరి టేస్ట్ వారిది.
అయితే తాజాగా ఓ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెళ్లి కార్డులో అతిధులకు ఓ కండిషన్ పెట్టారు ఆ నవజంట. మందు తాగిన వారు (Drunken people) తమ వివాహానికి రావద్దు అంటూ శుభలేఖలో పేర్కొన్నారు. ఈ పెళ్లి కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుజరాత్ కి చెందిన ఓ జంట ఈ విధంగా పెళ్లి కార్డులో ప్రింట్ చేయించారు. అయితే వారు ఇలా చేయడానికి ఓ కారణం ఉంది అంట. కొన్ని రోజుల క్రితం ఆ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో అతిధులు మందు తాగి వచ్చి గొడవపడ్డారట. దాంతో ఆ పెళ్లి ఆగిపోయిందట. అలా తమ పెళ్ళిలో జరగద్దు అని ముందుగానే పెళ్ళికార్డులో ఈ షరతు పెట్టారు ఆ జంట.
End of Article