Home Filmy Adda “రామ్ చరణ్” భవిష్యత్తు గురించి ఆ సినిమాలో అప్పుడే చెప్పారుగా..?

“రామ్ చరణ్” భవిష్యత్తు గురించి ఆ సినిమాలో అప్పుడే చెప్పారుగా..?

by Megha Varna

దర్శక ధీరుడు రాజమౌళి తీసుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కింద మారిపోయారు. ఆర్ఆర్ఆర్ సినిమా ముందు వరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక లెక్క అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ మరో రేంజ్ కి వెళ్ళిపోయాడు. పైగా చరణ్ పర్ఫామెన్స్ కి హాలీవుడ్ ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు అందుతున్నాయి.

తాజాగా హెచ్సీఏ అవార్డ్స్ వేడుకల్లో చరణ్ పాల్గొన్నారు. రెండు కేటగిరీలకు సంబంధించి విన్నర్స్ ని ప్రకటించగా గ్లోబల్ వేదిక మీద అరుదైన గౌరవాన్ని పొందారు చరణ్.

why RRR is the best film..

చరణ్ సాధించిన ఈ సక్సెస్ తో ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అటు ఫ్రెండ్స్, ఫ్యాన్స్ కూడా ఎంతో ఆనంద పడుతున్నారు. అయితే 10 ఏళ్ల క్రితమే లిరిసిస్ట్ చంద్రబోస్ చెప్పిన విషయం నిజమైంది. రచ్చ సినిమా డైరెక్టర్ సంపత్ నంది ఒక వీడియో ని షేర్ చేశారు. చంద్రబోస్ 10 ఏళ్ళ క్రితం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అవుతారని అన్నారు. అదే అండి రచ్చ సినిమాలో ఇంట్రడక్షన్ పాటలో (He is gonna be a Global Star) అని ఒక లైన్ ఉంది. ఈ పాటను చంద్రబోస్ 10 ఏళ్ళ క్రితం రాశారు.

చంద్రబోస్ చెప్పినట్లుగా 2022లో ఆర్ఆర్ఆర్ సినిమా తో అది నిజం అయ్యింది. ఈ విషయాన్ని రచ్చ సినిమా డైరెక్టర్ సంపత్ నంది చెప్పారు ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ చంద్రబోస్ ”అక్షరాల నిజం తమ్ముడు హృదయం నుంచి వచ్చిన మాటకి ఉన్న శక్తి అది” అని రీ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్‌కు అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

రచ్చ సినిమా లోని సాంగ్ కి చంద్రబోస్ లిరిక్స్ ఇవ్వగా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫి ఇచ్చారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. అలానే బుచ్చిబాబుతో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో చరణ్ ఒక మూవీ చేస్తున్నారు.

watch video :

You may also like