Ads
గౌతమ్ అదానీ చిక్కుల్లో పడ్డ విషయం అందరికీ తెలిసినదే. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో వున్న గౌతమ్ అదానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నెల రోజుల్లో మూడొంతులు కోల్పోయింది. చాలా వేగంగా అతను సంపదను కోల్పోయారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ చేసిన ఆరోపణలతో గ్రూప్ షేర్లు పడిపోయాయి. విలువ 150 బిలియన్ డాలర్లకు పైగా గ్రూప్ మార్కెట్ విలువ కోల్పోవడం జరిగింది. దీనితో 3వ స్థానం నుంచి అతను 30 కి తరవాత స్థానానికి చేరారు.
Video Advertisement
కేవలం అదానీ మాత్రమే కాదు వేదాంతా గ్రూప్ అధినేత అనిల్ అగర్వాల్ కూడా ఇప్పుడు రిస్క్ లోనే వున్నారు. ఈ విషయం దిగ్గజ సంస్థ ఎస్ అండ్ పీ చెప్పింది.
వివరాల లోకి వెళితే…. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో నమోదైన వేదాంత రీసోర్సెస్‌కు ప్రమాదం వుంది. అప్పుల లో కంపెనీ కూరుకుపోయింది. వచ్చే జనవరి కి ఈ కంపెనీ కి 100 కోట్ల డాలర్ల బాండ్లకు డెడ్ లైన్ క్లోజ్ అవుతుంది. నెమ్మదిగా రుణాలని కడుతూ వస్తోంది. 11 నెలల్లో రుణాలని 2 బిలియన్ డాలర్ల ని తగ్గించింది. 7.7 బిలియన్ డాలర్ల వరకు జాగ్రత్తగా తెచ్చింది. మన కరెన్సీ లో రూ.64 వేల కోట్లకుపైనే. 2023 సెప్టెంబర్ దాకా అయితే ఇబ్బంది ఉండదట. ఆ తర్వాతే సమస్యలు. 2024 జనవరి వరకు 150 కోట్ల డాలర్లు రుణ బాండ్ల ని తీర్చాలి. సుమారు రూ.12,450 కోట్ల ని కట్టాలి అని ఎస్ అండ్ పీ వివరించింది.
రానున్న కొన్ని వారాలు ఆయనకి చాలా కష్టం. బి- క్రెడిట్ రేటింగ్‌లో ఉన్న బాండ్లు మరెంత కీలకం. ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ జింక్‌లో షేర్ ని అనిల్ అగర్వాల్ 20 ఏళ్ల నుండే పెంచుతున్నారు. దానిలో 200 కోట్ల డాలర్ల దాకా నగదు నిల్వలున్నాయి. ఈ కంపెనీ లో వేదాంతా లిమిటెడ్ కి అయితే 65 శాతం వాటా వున్నది. అలానే వేదాంతా లో 70 శాతం వాటా వేదాంతా రిసోర్సెస్ వారిది.
THL జింక్ మారిషస్ వాటాను హిందుస్థాన్ జింక్‌కు విక్రయించాలని వేదాంతా చూస్తోంది. కానీ కేంద్రం దానికి ఒప్పుకోలేదు. 30 శాతం వాటా ఇందులో కేంద్రం కి వుంది. ఈ అప్పు కట్టాలంటే మళ్లీ అప్పులు చెయ్యాలి అనిల్ అగర్వాల్. అలానే రాజకీయపరమైన సమస్యా వుంది. ఒకవేళ ఆస్తుల విక్రయం గురించి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వస్తే అప్పుడు గుజరాత్‌లో, ఫాక్స్‌కాన్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఆయన ఫ్యాక్టరీ సమస్య రావచ్చు. 19 బిలియన్ డాలర్లతో ఏర్పాటు చేశారట. ప్రతిపక్షాలు దీని వైపు కన్ను వేసాయి కూడా.
https://telugu.samayam.com/business/business-news/gautam-adani-isnt-the-only-indian-tycoon-in-trouble-look-at-anil-agarwals-vedanta/articleshow/98288087.cms
End of Article