Ads
కొన్ని రోజుల నుండి మంచు మనోజ్ మౌనికని పెళ్లి చేసుకుంటారని గుసగుసలు వినపడుతున్నాయి. అయితే అవి నేడు నిజమయ్యాయి. మంచు మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగి రెడ్డి రెండవ కూతురు భూమా నాగ మౌనిక ని ఈరోజు ఉదయం 8:30 నిమిషాల కి వివాహం చేసుకున్నారు అని నెట్టింట విపరీతంగా వినపడుతోంది. అయితే ఈ పెళ్లి గురించి ఇరు కుటుంబాలకు కూడా ఏ విషయమూ చెప్పలేదు.
Video Advertisement
అధికారిక ప్రకటన కూడా చేయలేదు. అయితే కొన్నాళ్ల నుండి మంచు మనోజ్ మరియు భూమా నాగి రెడ్డి కూతురు భూమ నాగ మౌనిక ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది.
వీరి ఇద్దరిదీ కూడా ఇది రెండవ పెళ్లే. ఇదివరకు మంచు మనోజ్ కి వివాహం అయింది అలానే మౌనిక కి కూడా పెళ్లి అయింది. విచిత్రం ఏమిటంటే మౌనిక పెళ్లికి మనోజ్ కూడా వెళ్ళాడు. ఒక అతిథి కింద మౌనిక పెళ్లికి మంచు మనోజ్ వెళ్లడం జరిగింది. ఇప్పుడు మనోజ్ ని పెళ్లి చేసుకుంటోంది మౌనిక. సోషల్ మీడియాలో ఈ పెళ్లి కి సంబంధించిన ఫోటోలు వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి మౌనిక కి 2015 లో వివాహం అయింది. ఆ ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ కనపడుతున్నాయి.
వీళ్ళ పెళ్లి కి మోహన్ బాబు ఒప్పుకోకపోవడంతో మనోజ్ మౌనిక చాలా రోజుల నుండి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు అని కూడా టాక్. మంచు లక్ష్మి ఇంట్లోనే వీళ్ళ పెళ్లి జరిగిందట. అయితే మంచు మనోజ్ చాలా కాలం నుండి సినిమాలకి కుటుంబానికి కూడా దూరంగా ఉంటున్నారు.
ఈ మధ్యన సినిమాలు చేయలేదు. మొన్న మొన్ననే ”వాట్ ది ఫిష్” అనే సినిమాని చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మంచు మనోజ్ కానీ తన వ్యక్తిగత జీవితం గురించి ఎటువంటి విషయాలని బయట పెట్టలేదు. పెళ్లి ప్రస్తావన కూడా ఎక్కడా తీసుకురాలేదు మనోజ్.
వీడియో:
End of Article