“చాక్లెట్లు పంచినట్టు పంచుతున్నారు ఏంటి..?” అంటూ RRR పై కామెంట్స్..! ఏం జరిగిందంటే

“చాక్లెట్లు పంచినట్టు పంచుతున్నారు ఏంటి..?” అంటూ RRR పై కామెంట్స్..! ఏం జరిగిందంటే

by Megha Varna

Ads

RRR సినిమా కి మంచి గుర్తింపు వచ్చింది. అలానే అవార్డులు కూడా వచ్చాయి. దర్శక ధీరుడు రాజమౌళి తీసుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతో పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా ఓ పెద్ద స్థాయికి చేరుకుంది. ఇప్పుడు కూడా RRR గురించి మొత్రమ్రోగిపోతోంది.

Video Advertisement

ఆర్ఆర్ఆర్ సినిమా లో నటించి చక్కటి గుర్తింపుని పొందినందుకు గాను రామ్ చరణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ పురస్కారాల ప్రదానోత్సవానికి కూడా వెళ్లారు.

why RRR is so great..!! get the answer in Quora..

ఈ సినిమా ఎన్నో విజయాల్ని అందుకుంది.ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులను ఈ సినిమా దక్కించుకుంది. గత ఏడాది మార్చి 23వ తేదీన ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ అలానే సంగీత దర్శకుడు కీరవాణికి రాజమౌళికి కూడా అవార్డులు ఇస్తున్నారు అంటే ఎలాంటి సందేహం లేదు నిజానికి ఎన్ని అవార్డులు ఇచ్చినా కూడా అది తక్కువే అని చెప్పొచ్చు.

కానీ ఈ సినిమాలో పెద్దగా కనపడని అజయ్ దేవగన్, ఆలియా భట్, శ్రియకి అవార్డులు ఇవ్వడం అంటే చాలా వింతగా ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద కూడా ఆలియా భట్ పాత్ర ఆర్ఆర్ఆర్ సినిమాలో లేదు అలాంటి పాత్రకి అవార్డు ఎందుకు వస్తుంది..? అటువంటి పాత్ర చేస్తే అవార్డుని ఎలా ఇస్తారు.. అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు అయిన హెచ్సీఏ స్పాట్లైట్ అవార్డుల వేడుకలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పాల్గొన్న విషయం తెలిసిందే.

అలానే చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా అందులో పాల్గొన్నారు. అందరి చేతులో అవార్డులను పట్టుకొని ఫోటో కూడా తీసుకున్నారు. అయితే ఆలియా భట్ కి అవార్డు ఇవ్వడం విచిత్రంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు. కావాలని ఒక అవార్డుని ఆలియా భట్ కోసం తీసుకొచ్చారా అని కామెంట్లు చేస్తున్నారు. స్పాట్లైట్ వాళ్ళని అడిగి ఆమె కోసం అవార్డు తీసుకొని ఉంటారని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఆలియా భట్ అవార్డు మీద వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.


End of Article

You may also like