Ads
ఏ తండ్రి అయినా తన బిడ్డలను మంచి చదువులు చెప్పించి, గొప్పవారిని చేయాలని తాపత్రయపడుతుంటారు. వాళ్ళని ఉన్నత స్థానంలో చూడాలని ఆశ పడతారు. అలాంటి తండ్రి అర్ధాంతరంగా ప్రాణాలు వదిలితే ఆ పిల్లల పరిస్థితి ఎలా మారుతుందో అర్ధం చేసుకోవచ్చు.
Video Advertisement
అలాంటి విషాద సంఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. ఈ సంఘటన అందరిని కంటతడి పెట్టిస్తోంది. కడెం మండలంలోని మొర్రిగూడెం ఊరికి చెందిన తక్కెళ్ల వెంకటి కూడా తన కుమారుడు రోహిత్‌ని ఎంతో కష్టపడి చదివించాడు. అయితే రోహిత్ టెన్త్ క్లాస్ చదువుతున్న సమయంలో వెంకటి అనారోగ్యం వచ్చింది. తన తండ్రి అనారోగ్య పరిస్థితిని తెలుసుకున్న రోహిత్ కొన్ని రోజుల క్రితమే నిర్మల్ హస్పటల్ లో చికిత్స చేయించుకొని ఇంటికి తీసుకొచ్చాడు. సోమవారం నుండి పదవ తరగతి పరీక్షలు మొదలు కానుండగా ఆదివారం రోజు రాత్రి వెంకటి అనారోగ్యంతో కన్నుమూశాడు. అయితే తన తండ్రి కలను నిజం చేయడం కోసం పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి లేడనే బాధను, వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఇంట్లో శవం ఉండగానే తండ్రిని తలచుకుంటూనే ఎగ్జామ్ రాశాడు. రోహిత్ ఇంటి దగ్గర నుండి పరీక్ష హాల్ వరకు కూడా కన్నీటితో వెళ్లి తండ్రిని గుర్తుచేసుకుంటూ పరీక్ష రాయడం తోటి స్టూడెంట్స్ తో పాటు బంధువులను, గ్రామస్థులను కలచివేసింది. ఇక సోమవారం నాడు పరీక్ష పూర్తి చేసిన తరువాత రోహిత్ ఇంటికి వచ్చి తండ్రికి దహన సంస్కారాలు చేశారు. ఏ బిడ్డకు కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదని, రోహిత్ ను చూసినవారు కన్నీరు పెట్టుకున్నారు.
End of Article