Ugram Review : పోలీస్ ఆఫీసర్ గా “అల్లరి నరేష్” ఆకట్టుకున్నారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Ugram Review : పోలీస్ ఆఫీసర్ గా “అల్లరి నరేష్” ఆకట్టుకున్నారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by kavitha

Ads

  • సినిమా : ఉగ్రం
  • స్టార్ కాస్ట్ : అల్లరి నరేష్, మిర్నా మీనన్
  • దర్శకుడు : విజయ్ కనకమేడల
  • నిర్మాత : సాహు గారపాటి, హరీష్ పెద్ది
  • సంగీతం : శ్రీచరణ్ పాకాల
  • రన్ టైమ్ : 2 గం 28 నిమిషాలు
  • విడుదల : 05 మే 2023
    కథ:

శివ(నరేష్) ఒక స్ట్రిక్ట్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, అతను అమ్మాయిలను వేధించే గ్యాంగ్ ను అరెస్టు చేస్తాడు.  ఆ తరువాత ఈ గ్యాంగ్ అతని భార్య అపర్ణను  హెచ్చరిస్తుంది. శివ గ్యాంగ్ లో  ముగ్గురినీ చంపేస్తాడు. అయితే ఒకరు  తప్పింకుంటాడు.ఆ  తరువాత శివ, అతని ఫ్యామిలికి యాక్సిడెంట్ అవుతుంది. అయితే దాని తరువాత వారు కనిపించకుండా పోతారు. వీరి మిస్సింగ్‌కి గ్యాంగ్‌లోని తప్పించుకున్న నాలుగో వ్యక్తి కారణమా? శివ తప్పిపోయిన తన ఫ్యామిలీని కనిపపెట్టడా? అనేది మిగిలిన కథ.
రివ్యూ:

Video Advertisement

అల్లరి నరేష్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఇరవై ఏళ్లు దాటిపోయింది. ఆయన కెరీర్ మొదట్లో వరుసగా కామెడీ చిత్రాలలో నటిస్తూ కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికి, నరేష్‌ కామెడీ చిత్రాల మధ్యలో చేసిన శంభో శివ శంభో, గమ్యం, మహర్షి వంటి చిత్రాలు ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచాయి. వాటి వల్ల నరేష్ కూడా అలాంటి చిత్రాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ కనపరస్తున్నారు. ఈ క్రమంలోనే 2021లో విజయ్ కనకమేడల దర్శకత్వంలో ‘నాంది’ సినిమాలో నటించిన అందరినీ ఆశ్చర్యపరచాడు. గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా ఈ చిత్రంలో నరేష్ కనిపించారు.
ఉగ్రం మూవీ పోలీస్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కింది. సిన్సియర్ పోలీస్ క్యారెక్టర్ లో అల్లరి నరేష్ నటించారు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఆకట్టుకుంటుంది. ఆయన పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరుకి, అల్లరి నరేష్ లోని కామెడీ యాంగిల్ అనేది గుర్తుకు రాదు. నరేష్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్ కి పూర్తి న్యాయం చేశాడు. నరేష్ వైఫ్ గా మర్నా మీనన్ బాగానే చేసింది. డాక్టర్‌గా ఇంద్రజ బాగా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ugram movie reviewదర్శకుడు రాసుకున్న స్టోరీ బాగున్నా, కథనాన్ని నడిపించిన విధానం ఎఫెక్ట్‌గా అనిపించ‌దు. ఫస్టాఫ్ మూవీ అంతా చాలా నెమ్మదిగా రొటీన్, యాక్షన్ డ్రామాల సాగుతుంది. లవ్ ట్రాక్ ఉన్నా అంతగా వర్కౌట్ కాలేదు. ఇంటర్వెల్ సీక్వెన్స్ , ట్విస్టులు, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ మూవీ సెకండాఫ్‌లో ఆడియెన్స్ కి కొంచెం రిలీఫ్ ను ఇస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.ugram movie review

ప్లస్ పాయింట్స్ :

  • నరేష్ నటన,
  • నేపథ్య సంగీతం,
  • సినిమాటోగ్రఫీ,
  • ఇంట‌ర్వెల్ సీక్వెన్స్,

మైనస్ పాయింట్స్:

  • స్లో నెరేషన్
  • ల‌వ్ స్టోరీ సీక్వెన్స్

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్ :

నాంది మ్యాజిక్‌ను ఉగ్రంతో నరేష్, విజయ్ కనకమేడల రిపీట్ చేయలేక‌పోయారు. యాక్ష‌న్ సినిమాల‌ను చూసేవారికి వారికి ‘ఉగ్రం’ ఒక్కసారి చూడగలిగే సినిమా.

watch trailer :


End of Article

You may also like