Ads
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘ఆదిపురుష్’ సినిమా కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కించాడు. 600 కోట్ల భారీ బడ్జెట్ తో టి.సిరీస్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.
Video Advertisement
ఆదిపురుష్ చిత్రం జూన్ 16న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ చేసిన చేసిన టీజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మే 9 న ట్రైలర్ దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ రోజు ఫ్యాన్స్ కోసం ట్రైలర్ ప్రీమియర్ స్క్రీనింగ్ చేశారు. మరి ట్రైలర్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్, కృతి సనన్ సీతారా చిత్రం ములుగా నటిస్తున్న ‘ఆదిపురుష్’. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ వి.ఎఫ్.ఎక్స్ నాసిరకంగా ఉందని, కార్టూన్ మూవీలా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేశారు. అయినప్పటికీ ‘ఆదిపురుష్’ టీజర్ ట్రెండ్ అవడమే కాక, యూట్యూబ్ లో వంద మిలియన్లకు పైగా వ్యూస్ తో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ‘ఆదిపురుష్’ పై ట్రోల్స్ రావడం, ప్రభాస్ లుక్ పై సెటైర్లు రావడం ప్రభాస్ అభిమానులకు అస్సలు నచ్చలేదు అని చెప్పవచ్చు. ఈ క్రమంలో మే 9న సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు థియేటర్లలో, అదే సమయంలో యూట్యూబ్ లో ‘ఆదిపురుష్’ ట్రైలర్ రిలీజ్ కానుంది. ‘ఆదిపురుష్’ ట్రైలర్ 105 థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఈరోజు హైదరాబాద్ లోని ఏఎంబీ థియేటర్ లో ట్రైలర్ ప్రీమియర్ ను ప్రదర్శించారు. ట్రైలర్ ను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.
ఒక ట్విట్టర్ యూజర్ ఇలా ట్వీట్ చేశారు. ట్రైలర్ నిడివి 3 నిమిషాల 22 సెకన్లు. ట్రైలర్ సీతను ఎత్తుకెళ్ళే సన్నివేశంతో మొదలై, రావణుడితో ఆఖరి పోరు వరకు జరిగే సంఘటనలతో కుడి ఉందని తెలిపారు. డీసెంట్ ట్రైలర్, టీజర్ కంటే వీఎఫ్‌ఎక్స్ బెటర్ గా ఉందని ట్వీట్ లో రాసుకొచ్చారు.
‘ఆదిపురుష్’ ట్రైలర్ ను చూసిన మరొక ట్విట్టర్ యూజర్ తన ట్వీట్ లో ” ట్రైలర్ లో 2 నిముషాల 32 సెకండ్ల వద్ద షాట్ గూస్‌బంప్స్ వచ్చేలా ఉందని బెస్ట్ వి.ఎఫ్.ఎక్స్ షాట్” అని రాసుకొచ్చారు. అలాగే మరొక ట్వీట్ లో ట్రైలర్ లోని చివరి షాట్ అందరినీ విస్మయానికి గురి చేస్తుందని తెలిపారు.
‘ఆదిపురుష్’ ట్రైలర్ ప్రీమియర్ చూసిన వారందరూ ఈ చిత్రం గురించి పాజిటివ్ గా స్పందిస్తున్నారు. చూస్తుంటే ఈ మూవీ పై వచ్చిన నెగటివ్ టాక్ సినిమా విడుదల సమయానికి పూర్తిగా పాజిటివ్ గా మారే అవకాశం కనిపిస్తోంది.
Also Read: రియల్ TO రీల్..! అసలు నిజ జీవితంలో ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?
End of Article