Ads
కొన్ని సందర్భాల్లో ఒక మనిషికి, మరొక మనిషికి ఎక్కడో ఒకచోట సిమిలారిటీస్ ఉంటాయి. పుట్టిన తేదీ కలవడం, లేదా పుట్టిన ఊరు ఒకటే అవ్వడం అలా అన్నమాట.
Video Advertisement
ఇలా మన సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక ఇద్దరికి కో – ఇన్సిడెంటల్ గా కొన్ని విషయాలు కలిశాయి. మన ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్.
అలాగే సినిమాకి, సినిమాకి సంబంధం లేకుండా ప్రతి సినిమాకి డిఫరెంట్ కాన్సెప్ట్ తో మనల్ని అలరిస్తున్నారు మంచు మనోజ్. ఎన్టీఆర్ ఇంకా మంచు మనోజ్ మంచి స్నేహితులు అనే విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరికీ కో ఇన్సిడెంటల్ గా కొన్ని విషయాలు కలుస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ 1983 మే 20వ తేదీన పుట్టారు. మంచు మనోజ్ పుట్టిన తేదీ మే 20, 1983.
జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారిగా 1991 లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు. ఆ తర్వాత 1996 లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం సినిమాలో రాముడిగా నటించారు జూనియర్ ఎన్టీఆర్. మంచు మనోజ్ 1993 లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.
తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించారు మంచు మనోజ్. జూనియర్ ఎన్టీఆర్ మొదటి చిత్రం అయిన బ్రహ్మర్షి విశ్వామిత్ర లోనూ, మంచు మనోజ్ మొదటి చిత్రం అయిన మేజర్ చంద్రకాంత్ లోనూ నందమూరి తారక రామారావు గారు ప్రధాన పాత్ర పోషించారు.
జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ గారు ఎన్నో సినిమాల్లో నటించారు. అలాగే మాజీ ఎంపీ కూడా. మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు గారు కూడా ఎన్నో సినిమాల్లో నటించడంతో పాటు ఎంపీగా కూడా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి 2011 లో మే నెలలో లక్ష్మీ ప్రణతి తో వివాహం జరిగింది. మంచు మనోజ్ కి 2015లో మే నెలలో వివాహం జరిగింది. మంచు మనోజ్ భార్య పేరు ప్రణతి.
End of Article