తల్లి చనిపోయాక ఈ కూతుళ్లు ఏం చేసారో తెలిస్తే… హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

తల్లి చనిపోయాక ఈ కూతుళ్లు ఏం చేసారో తెలిస్తే… హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

by kavitha

Ads

ఈ సృష్టిలో అన్నిటి కన్నా తియ్యని పదం అమ్మ. తాను కొవ్వొత్తిలా కాలిపోతూ తన పిల్లలకు వెలుగు నిస్తుంది. అమృతం ఎంత రుచిగా ఉంటుందో తెలియదు. కానీ అమ్మ ప్రేమ ముందు అమృతం కూడా దిగదుడుపే. అమ్మ ప్రేమ ఈ లోకాన్నే మరిపింపజేస్తుంది. అమ్మ అనే పదానికి అంతటి మాధుర్యం ఉంది.

Video Advertisement

దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని అంటుంటారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతలో నైనా, అక్కడ ఉండే సంస్కృతులు మారుతాయి. అయితే అమ్మ ప్రేమ మాత్రం మారదు. మనిషికి కొంచెం బాధ కలిగినా వెంటనే అమ్మను గుర్తు చేసుకుంటాం. అలాంటి అమ్మ దూరం అయితే తట్టుకోలేము. కానీ ఓ అక్కాచెల్లెలు దూరం అయిన అమ్మ కోసం ఏం చేశారో ఇప్పుడు చూద్దాం..
గుజరాత్‌ రాష్ట్రంలోని జునాగఢ్‌లో నివసిస్తున్న హీరాబెన్ తన ముగ్గురు కుమార్తెలతో పాటు జీవించేది. తన పిల్లల బాగోగులు చక్కగా చూసుకునేది. ఆమెకు బీపీ రావడంతో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా గుండెపోటు వచ్చి కన్ను మూసింది. దాంతో ఆ ముగ్గురు సోదరీమణులు తల్లి లేని వారు అయ్యారు. తల్లి మరణించిన 6 నెలల వరకు ఆమె ఆలోచనలతోనే గడిపారు. అప్పుడు వారికి తల్లి తిరిగి తీసుకురాలేము కానీ ఆమె ఆమె విగ్రహాన్ని అయితే తీసుకురావచ్చని, 6 అడుగుల ఎత్తైన తల్లి విగ్రహాన్ని తేరు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు.
హీరాబెన్ తన జీవితాంతం వరకు తన కుమార్తెలకు ప్రతి విషయంలో మద్దతుగా ఉంది. తమ తల్లి విగ్రహానికి రోజూ హారతి ఇస్తారు. తమ కళ్ళ ముందు అమ్మ ఉన్నట్టుగానే భావిస్తున్నారు. ఇప్పుడు ఆ సోదరీమణులు తమ తల్లి లేదని బాధపడటం లేదు. విగ్రహంలోనే తమ తల్లిని చూసుకుంటున్నారు.
రోజూ విగ్రహాన్ని చూస్తూ కబుర్లు చెబుతూ తల్లి  లేని లోటును మర్చిపోతున్నామని చెబుతున్నారు ఈ అక్కచెల్లెల్లు. అలాగే ఆమె జ్ఞాపకార్థం ఒక ఫౌండేషన్‌ను ప్రారంభించి, దాని ద్వారా పలువురికి సంక్షేమ సహాయాన్ని అందిస్తున్నారు. అనాథ పిల్లలకు అన్నదానం, చదువు లేనిపిల్లలకు వారి చదువు కోసం సహాయం చేస్తున్నారు.

Also Read: ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన “నరసింహ నాయుడు” మూవీ రిలీజ్ టైం లో ఏం జరిగిందో తెలుసా..??


End of Article

You may also like