Ads
నటి అనసూయ భరద్వాజ్, విజయ్ దేవరకొండకి మధ్య జరుగుతున్న విషయం గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంపై అనసూయ స్పందిస్తూ అసలు ఏం జరిగింది అని చెప్పారు.
Video Advertisement
అంతే కాకుండా అనసూయ ఇప్పుడు ఇంక ఈ విషయం గురించి మాట్లాడదలచుకోవట్లేదు అని, ఈ టాపిక్ ఇక్కడతో ఆపేయాలి అనుకుంటున్నారు అని చెప్పారు. తనకి తన మానసిక ప్రశాంతత ముఖ్యం అని, అందుకే ఇంక ఈ విషయాన్ని ఇంకా ఎక్కడ ప్రస్తావించదల్చుకోవట్లేదు అని చెప్పారు. అయితే అనసూయ నటించిన విమానం సినిమా ఇటీవల విడుదల అయ్యింది.
ఈ సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా అనసూయ విజయ్ దేవరకొండ గురించి జరిగిన డిస్కషన్ పై కూడా మాట్లాడారు. ఇందులో అనసూయ మాట్లాడుతూ, ఇంక ఈ విషయం గురించి తాను మాట్లాడదలచుకోవట్లేదు అని అన్నారు. ఇదంతా కొంచెం ఇంపల్సివ్ గా చేశాను అని అన్నారు. తనపై ఒకరు అలా డబ్బులు ఇచ్చి మరి నెగిటివ్ కామెంట్స్ చేయిస్తున్నారు అని తెలిసేటప్పటికి షాకింగ్ అనిపించింది అని అనసూయ అన్నారు.
అయితే ఒకరు, “ఈ విషయం గురించి విజయ్ దేవరకొండ కి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా?” అని అన్నారు. అందుకు అనసూయ సమాధానం చెబుతూ, తాను విజయ్ దేవరకొండకి ఫోన్ చేయడానికి కూడా ప్రయత్నించాను అని అన్నారు. ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా అనసూయ నటిస్తున్నారు. అనసూయ విమానంలో పోషించిన సుమతి పాత్రకి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి.
ఇందులోనూ ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించారు అని ప్రేక్షకులు అనసూయని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చాలా ఎమోషనల్ గా ఉంది అని, ఇందులో నటీనటులు అందరూ కూడా చాలా బాగా చేశారు అని, ఇలాంటి ఎమోషనల్ సినిమాలు చూసి చాలా రోజులు అయ్యింది అని ప్రేక్షకులు అంటున్నారు.
watch video :
https://www.instagram.com/reel/CtZIf7DOUTM/?igshid=NjZiM2M3MzIxNA==
End of Article