“లావణ్య త్రిపాఠి” గురించి అల్లు అరవింద్ కంటే ముందే మరొకరు చెప్పేసారుగా..? ఎవరంటే..?

“లావణ్య త్రిపాఠి” గురించి అల్లు అరవింద్ కంటే ముందే మరొకరు చెప్పేసారుగా..? ఎవరంటే..?

by kavitha

Ads

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కొన్నేళ్ళ నుండి  ప్రేమలో ఉన్న వరుణ్, లావణ్యలు ఈ వేడుకతో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఎంగేజ్‌మెంట్ వేడుక ముగిసిన తరువాత ఇద్దరు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేశారు.

Video Advertisement

చాలాకాలం నుండి వీరిద్దరి ప్రేమ గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరి ఎంగేజ్‌మెంట్ జరగడంతో ఈ విషయం గురించి అల్లు అరవింద్ ఒక ఈవెంట్ లో అన్నదే జరిగిందని అన్నారు. అయితే పదేళ్ళ క్రితమే ఆ సినిమాలో లావణ్య గురించి చెప్పారని తాజాగా ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ సినిమా ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కొన్నేళ్ళ నుండి ప్రేమించుకుంటున్న వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ జూన్ 9న గ్రాండ్ గా నాగబాబు నివాసంలో జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకకు మెగా, అల్లు కుటుంబాలు హాజరు అయ్యారు. వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే వీరి వివాహం జరుగనుంది.
వీరి ఎంగేజ్‌మెంట్ తరువాత అల్లు అరవింద్ చావు కబురు చల్లగా సినిమా ఈవెంట్‌లో లావణ్య గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే పదేళ్ళ క్రితమే ఒక సినిమాలో లావణ్య పెళ్లి గురించి చెప్పారని ఒక వీడియో తాజాగా వైరల్ అవుతోంది. లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు.
ఈ చిత్రంలో ఒక సీన్ లో లావణ్య త్రిపాఠిని పిల్లలు నీ పెళ్లికి చిరంజీవి వస్తాడట నిజమేనా అని అడుగుతారు. అప్పుడు లావణ్య వారితో అవును అంటుంది. ఆ సినిమాలో చెప్పినట్టుగానే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలపెళ్లికి మెగాస్టార్ చిరంజీవి వస్తాడనే విషయం తెలిసిందే. వరుణ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్ కూడా చిరంజీవి హాజరు అయ్యారు.

Also Read: అప్పట్లో కూడా ఇంత చెత్త సినిమాలు ఉన్నాయా..? ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా గురించి తెలుసా..?

 


End of Article

You may also like