Ads
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ వాటెండ్ హీరోయిన్ ఎవరంటే శ్రీలీల పేరు వినిపిస్తుంది. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత హీరో రవితేజతో చేసిన ధమాకా మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
Video Advertisement
ఈ మూవీ హిట్ తరువాత టాలీవుడ్ లో శ్రీలీలకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. దాంతో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఆడియెన్స్ ను అలరించేందుకు శ్రీలీల సిద్ధమయ్యింది. జూన్ 14 శ్రీలీల బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రాల నుండి ఫస్ట్ లుక్స్ విడుదల అయ్యాయి. వాటిపై తాజాగా నెట్టింట్లో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
చక్కగా తెలుగులో మాట్లాడడం, డ్యాన్స్ బాగా చేస్తుండడంతో యంగ్ హీరోయిన్ శ్రీలీల పై దృష్టి పడింది. ధమాకా హిట్ తో టాలీవుడ్ లో ఈ బ్యూటీకి ఆఫర్స్ వస్తున్నాయి. తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలోనూ నటిస్తోంది. ఈ రోజు (జూన్ 14) శ్రీలీల పుట్టినరోజు కావడంతో ఆమె నటిస్తోన్న చిత్రాల నుండి వరుసగా ఫస్ట్ లుక్స్ విడుదల అయ్యాయి. ఆమె ప్రస్తుతం పది సినిమాలలో నటిస్తోంది.
వాటిలో సుమారు 8 చిత్రాలు ప్రకటించారు. వాటిలో ప్రస్తుతం 6 సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. కొన్ని సినిమాలు త్వరలో షూటింగ్ మొదలవనుంది. దీంతో శ్రీలీల బిజీ బిజీగా ఉంది. ఈరోజు ఆమె బర్త్ డే కావడంతో ట్విట్టర్ అంతా శ్రీలీల పోస్టర్స్ తో ట్రెండ్ అవుతున్నాయి.
ఆమె నటిస్తోన్న మొత్తం సినిమాలను చూస్తే పంజా వైష్ణవ్ తేజ్ తో ఆదికేశవ, బాలకృష్ణతో భగవంత్ కేసరి, మహేష్ బాబు గుంటూరు కారం, డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ పోతినేని మూవీలో నటిస్తోంది. అలాగే ఆహా ఓటీటీ మూవీ కోసం అల్లు అర్జున్ సినిమాలో, నితిన్ కొత్త చిత్రంలో శ్రీలీల నటిస్తోంది. ఇక ఇన్ని సినిమాలలో నటిస్తున్న శ్రీలీల మూవీ పోస్టర్స్ పై నెట్టింట్లో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
1.
2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15.
Also Read: “లావణ్య త్రిపాఠి” గురించి అల్లు అరవింద్ కంటే ముందే మరొకరు చెప్పేసారుగా..? ఎవరంటే..?
End of Article