Adipurush Review : “ప్రభాస్” ఈ సినిమాతో అయినా హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Adipurush Review : “ప్రభాస్” ఈ సినిమాతో అయినా హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాపై ప్రేక్షకులకి భారీగా అంచనాలు ఉన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ రామాయణంపై వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : ఆదిపురుష్
  • నటీనటులు : ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్.
  • నిర్మాత : భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్
  • దర్శకత్వం : ఓం రౌత్
  • సంగీతం : అజయ్-అతుల్, సచేత్-పరంపర
  • విడుదల తేదీ : జూన్ 16, 2023

adipurush movie review

స్టోరీ :

అరణ్యకాండంతో సినిమా మొదలవుతుంది. రాఘవుడు (ప్రభాస్), శేష్ (సన్నీ సింగ్) తో పాటు వనవాసంలో ఉన్న జానకి (కృతి సనన్) ని, లంకేష్ (సైఫ్ అలీ ఖాన్) అపహరించి తనతో పాటు లంకకి తీసుకువెళ్తాడు. తర్వాత రాఘవుడు, హనుమంతుడితో కలిసి జానకిని లంక నుండి ఎలా తీసుకోవచ్చాడు? తర్వాత ఏం జరిగింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

రామాయణం అంటే మనకి కేవలం ఒక పుస్తకం లేదా ఒక కథ మాత్రమే కాదు. రామాయణం అనేది భారతదేశ ప్రజలకి ఒక ఎమోషన్. ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో తరాల వారు వారి బాల్యం నుండి రామాయణ కథని వింటూ, వారి తర్వాతి తరాల వారికి చెబుతూ వచ్చారు. ఎంతో మంది ఫిలిం మేకర్స్ రామాయణంపై తమదైన శైలిలో సినిమా తీశారు. రామాయణం కథ అందరికీ తెలిసిందే అయినా కూడా రామాయణంపై వచ్చిన సినిమాలకి ప్రేక్షక ఆదరణ బాగుండేది.

మనం రామాయణానికి ఇచ్చే విలువ అలాంటిది. అయితే ప్రభాస్ రాముడిగా నటిస్తున్నారు అనంగానే ప్రేక్షకులలో ఏదో ఒక తెలియని ఆసక్తి మొదలయింది. అందుకు కారణం ఇప్పటి తరం హీరోల్లో రాముడిగా నటించిన నటులు ఎవరూ లేరు. ప్రభాస్ ఈ పాత్రకి సరిగ్గా సూట్ అవుతారు అని చాలా మంది అనుకున్నారు. కానీ సినిమా ట్రైలర్ ఇవన్నీ విడుదల అయిన తర్వాత నుండి సినిమాపై క్రేజ్ పెరగడం పక్కన పెడితే, వివాదాలు మాత్రం ఒకదాని వెనుక మరొకటి వస్తూనే ఉన్నాయి.

minus points in adipurush trailer

కొంత మంది గ్రాఫిక్స్ బాలేదు అంటే, మరి కొంత మంది అందులో సీన్స్ చూపించడంలో తప్పు ఉంది అంటూ కామెంట్స్ చేశారు. దాంతో సినిమా బృందం కొంత సమయం తీసుకుని మరి సినిమాపై మళ్లీ పని చేసి విడుదల చేశారు. టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు వచ్చే రామ్ సీతా రామ్ పాటతో సినిమా మొదలవుతుంది.  సినిమాలో చూపించే కథ పైన చెప్పినట్టుగా మనందరికీ తెలిసిన కథ. ఫస్ట్ హాఫ్ చాలా ఎమోషనల్ గా నడుస్తుంది.

minus points in adipurush trailer

సినిమా చూసి ఒక ప్రేక్షకుడు, “సెకండ్ హాఫ్ కూడా ఇలాగే ఉంటే, ఇంక సినిమా హిట్ కొట్టడం పక్కా” అని అనుకుంటూ ఉన్న సమయంలోనే నిరాశ మిగిలుస్తుంది. సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ సాగదీశారు. అలా నడుస్తూ వెళ్తుంది అంతే. ఒక్క చోట కూడా ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించే సీన్ లేదు. ఇంక చివరిలో వచ్చే యుద్ధం సీన్ అయితే చాలా సాగదీశారు. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రభాస్ రాఘవుడిగా ఒక శాంత స్వభావం కలిగిన మనిషిగా బాగా నటించారు.

minus points in adipurush trailer

కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ప్రభాస్ నటన బాగుంది. జానకిగా నటించిన కృతి సనన్ పాత్ర సినిమాలో కనిపించేది తక్కువే అయినా కూడా తనకి ఇచ్చిన సీన్స్ వరకు బాగా నటించారు.  శేష్ గా సన్నీ సింగ్ తన పాత్ర పరిధి మేరకు నటించారు. హనుమంతుడిగా నటించిన దేవదత్త నాగే కూడా చాలా బాగా నటించారు. ఇంక లంకేష్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ నటన బానే ఉన్నా కూడా పాత్ర తీర్చిదిద్దిన విధానంలో ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.

minus points in adipurush trailer

సినిమా చూస్తున్నంత సేపు మనకి ఒక రావణాసురుడిని చూస్తున్నాము అని కాకుండా, ఏదో ఒక హాలీవుడ్ సినిమాలో విలన్ ని చూస్తున్నాం ఏమో అని అనిపించేలాగా ఆ పాత్ర ఉంది. పాటలు కూడా ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఒక మంచి పౌరాణిక సినిమా చూస్తున్నాం అని ప్రేక్షకులకు అనిపించేలా ఉండడానికి ఈ మ్యూజిక్ చాలా పెద్ద హైలైట్ అయ్యింది. గ్రాఫిక్స్ చాలా వరకు మార్చినా కూడా, ఇంకా సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడో లోపాలు కనిపిస్తూనే ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా క్లైమాక్స్ చాలా ఎక్కువ సేపు ఉండడంతో అక్కడ గ్రాఫిక్స్ తప్పులని ప్రేక్షకుడు చాలా ఈజీగా కనిపెట్టేస్తాడు.

adipurush

మరొక ముఖ్య విషయం ఏంటంటే సినిమాకి నేటివిటీ చాలా మిస్ అయ్యింది అనిపిస్తుంది. దర్శకుడు ఓం రౌత్ అంతకుముందు హిందీలో తీసిన తానాజీ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా హిందీ ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్టు ఉంది కాబట్టి హిందీలో కచ్చితంగా హిట్ అవుతుంది. కానీ మన తెలుగు ప్రేక్షకులకు మాత్రం సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడో ఏదో కనెక్టివిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది.

అందుకు మరొక ముఖ్య కారణం ప్రభాస్ తప్ప సినిమాలో తెలుగు మాట్లాడే నటులు, లేదా తెలుగులో అందరికీ తెలిసిన నటులు ఒక్కరు కూడా లేరు. కనీసం ముఖ్య పాత్రలో అయినా కొంత మంది తెలుగువారిని తీసుకొని ఉంటే, ఏదో ప్రభాస్ కోసం తెలుగులో తీశారు అని కాకుండా, సినిమా తెలుగు సినిమా అని చెప్పుకోడానికి కూడా బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

  • ప్రభాస్
  • పాటలు
  • కొన్ని యాక్షన్ సీన్స్
  • ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్:

  • లంకేష్ పాత్ర తీర్చిదిద్దిన విధానం
  • సాగదీసిన సెకండ్ హాఫ్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

రామాయణాన్ని కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల అది ప్రేక్షకులకి నచ్చినా కూడా, మరికొన్ని చోట్ల మాత్రం కాస్త డిసప్పాయింట్ చేస్తుంది. ఏదేమైనా సరే సినిమాపై ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ప్రభాస్ కోసం సినిమా చూద్దాం అనుకునే వారికి ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. ఈ కాలంలో రామాయణాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి చేసిన మంచి ప్రయత్నంగా ఆదిపురుష్ సినిమా నిలుస్తుంది.

watch trailer :


End of Article

You may also like