“ఏదో డబ్బింగ్ సినిమా చూసినట్టు ఉంది ఏంటి..?” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్” రిలీజ్‌పై 15 మీమ్స్..!

“ఏదో డబ్బింగ్ సినిమా చూసినట్టు ఉంది ఏంటి..?” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్” రిలీజ్‌పై 15 మీమ్స్..!

by kavitha

Ads

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఆదిపురుష్ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. రామాయణ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటించారు.

Video Advertisement

బాలీవుడ్ లో తానాజీ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి ముందుగా గ్రాఫిక్స్ విషయంలో నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత రిలీజ్ అయిన ట్రైలర్స్, పాటలు ఈ చిత్రం మీద భారీ అంచనాలను పెంచాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ పై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ మరియు ఆయన ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదిపురుష్ రిలీజ్ అయిన థియేటర్ల దగ్గర వాతావరణం జాతరను తలపిస్తోంది. ఫ్యాన్స్ బాణాసంచా కాాలుస్తూ హంగామా చేస్తున్నారు. ఈ మూవీకి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవు. రాముడి క్యారెక్టర్ లో ప్రభాస్ అద్భుతంగా చేసారంటూ  అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఆదిపురుష్ థియేటర్లలో రామ భక్తుడు హనుమంతుడి కోసం ఒక సీటును కేటాయించాలని డైరెక్టర్ ఓం రౌత్ కోరిన సంగతి తెలిసిందే. శ్రీ రాముడి కథ ఎక్కడ వినిపించినా అక్కడికి హనుమంతుడు వస్తాడని భక్తుల నమ్మకం.  అనుకున్నట్టుగానే థియేటర్ లోకి హనుమంతుడు వచ్చాడు. ఆదిపురుష్ మూవీ ప్రదర్శిస్తున్న ఒక థియేటర్ లోకి  కోతి వచ్చింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హనుమంతుడి కోసం రిజర్వ్ చేసిన సీటులో హనుమంతుడి ఫోటోను పెట్టి పూజ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో ఎక్కడ చూసినా ఆదిపురుష్ గురించిన వార్తలే. తాజాగా ఈ సినిమా రిలీజ్ పై రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ మీమ్స్ ఏమిటో మీరు చూడండి..

1. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16.

Also Read: ADIPURUSH REVIEW : “ప్రభాస్” ఈ సినిమాతో అయినా హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like