Home Filmy Adda “ఒరిజినల్ అని చెప్పి ఫ్యాన్ మేడ్ పోస్టర్ రిలీజ్ చేశారు ఏంటి..?” అంటూ… ప్రాజెక్ట్-K నుండి “ప్రభాస్” ఫస్ట్‌లుక్‌పై 15 మీమ్స్..!

“ఒరిజినల్ అని చెప్పి ఫ్యాన్ మేడ్ పోస్టర్ రిలీజ్ చేశారు ఏంటి..?” అంటూ… ప్రాజెక్ట్-K నుండి “ప్రభాస్” ఫస్ట్‌లుక్‌పై 15 మీమ్స్..!

by Mohana Priya

వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ నటించిన గత సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా నెక్స్ట్ సినిమాలపై క్రేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, అలాగే మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ సినిమాలో నటిస్తున్నారు.

ఇది మాత్రమే కాకుండా ప్రభాస్ అభిమానులు, అలాగే సినిమా అభిమానులు అందరూ కూడా ఆసక్తికరూరు చూస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

trending memes on project k prabhas first look poster

ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే చిన్న చిన్న వీడియోలు, కొన్ని పోస్టర్స్ విడుదల చేశారు. ఇవన్నీ కూడా సినిమాపై అంచనాలని ఇంకా పెంచాయి. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే దిశా పటాని కూడా మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు. లెజెండరీ నటుడు కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు.

trending memes on project k prabhas first look poster

అంతే కాకుండా మరొక గొప్ప నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. కామిక్ కాన్ లో ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తారు అని చెప్పారు. కానీ టైటిల్ ప్రకటించక ముందే ఈ సినిమా పేరులో కె అంటే కాలచక్ర అని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలి అంటే టైటిల్ ప్రకటించే అంతవరకు ఆగాల్సిందే.

What-is-Project-K

ఇదిలా ఉండగా ఇటీవల దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అందులో దీపికా పదుకొనే గెటప్ రివిల్ చేయకుండా కేవలం ముఖం వరకు ఉన్న పోస్టర్ విడుదల చేశారు. అయితే ఇవాళ ప్రభాస్ పోస్టర్ కూడా విడుదల చేస్తున్నట్టు సినిమా బృందం ప్రకటించింది. మిగిలిన వాళ్ళ ఫస్ట్ లుక్స్ కూడా రిలీజ్ చేస్తాము అని ప్రకటించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18

You may also like