Ads
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీకి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహించారు. ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించారు. భారీ అంచనాల, విమర్శల మధ్య ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా రెండు రోజుల్లో రూ.240 కోట్లు కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది.
Video Advertisement
ఒక వైపు వసూళ్లు సాధిస్తున్నప్పటికీ, మరో వైపు ఈ చిత్రం తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటుంది. ఇప్పటికే డైలాగ్స్, పాత్రల వేషధారణ, గ్రాఫిక్స్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. తాజాగా మరొక విషయం వివాదస్పదంగా మారింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
‘ఆదిపురుష్’ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు మొదలైన విమర్శలు, వివాదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ టీజర్ రిలీజ్ చేయడంతో గ్రాఫిక్స్ పైన, పాత్రల ఆహార్యం పైన ట్రోల్స్ వచ్చాయి. కానీ ట్రైలర్ రిలీజ్ తరువాత పాజిటివ్ టాక్ ఏర్పడింది. హనుమంతుడి కోసం ఒక సీట్ రిజర్వ్ చేయడంతో అందరు భక్తిభావంతో మూవీకి వెళ్లారు. తీరా మూవీ చూసిన తరువాత మూవీ దర్శకుడిని విమర్శిస్తున్నారు. అసలు రామాయణం మూవీ ఎలా ఉండాలి ? ఎలా తీశారని విమర్శిస్తున్నారు. ఏ క్యారెక్టర్ ను స్పష్టంగా చూపించలేదని, హనుమంతుడి డైలాగ్స్ పై విమర్శిస్తున్నారు. ఈ మూవీలో రాఘవుడు, జానకి, శేషు అని రామాయణ పాత్రల పేర్లు మార్చారని మండిపడుతున్నారు. ఆదిపురుష్ మూవీలోని పాత్రలను హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా తీర్చిదిద్దారని ఆరోపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మరో విషయం వివాదస్పదంగా మారింది. రావణాసురుడు రాక్షసుడు అయినప్పటికీ, బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు మాంసాహారాన్ని ముట్టుకోరు. కానీ ఆదిపురుష్ సినిమాలో రావణాసురుడుగా నటించిన సైఫ్ అలీఖాన్ పక్షికి మాంసాహారాన్ని తన చేతులతో స్వయంగా తినిపిస్తాడు. రావణుడు ఇలా ఎప్పటికి చేయడు. ఇంత పెద్ద తప్పు ఎలా చేసారు అంటూ నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
https://www.instagram.com/reel/Ctnihgmh2FZ/?igshid=NjZiM2M3MzIxNA==
Also Read: “ప్రభాస్” తో పాటు… సినిమాల్లో “రాముడి పాత్ర” పోషించిన 12 హీరోలు..!
End of Article