“ఆదిపురుష్” సినిమాలో “ఇంద్రజిత్” గా నటించిన అతను ఎవరో తెలుసా..? అతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

“ఆదిపురుష్” సినిమాలో “ఇంద్రజిత్” గా నటించిన అతను ఎవరో తెలుసా..? అతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by kavitha

Ads

బాలీవు డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా మొదటి షో నుండి మిక్స్డ్ టాక్ తెచుకుంది. ఈ మూవీ పై విమర్శలు, వివాదాలు వస్తున్నప్పటికి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ భారీగా రాబడుతుంది.

Video Advertisement

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, సీతాదేవిగా కృతిసనన్, రావణుడుగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటించారు. అయితే ఈ చిత్రంలో ఇంద్రజిత్ పాత్రలో నటించిన నటుడు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఆదిపురుష్ సినిమాలో ఇంద్రజిత్ పాత్రలో నటించిన యాక్టర్ పేరు వత్సల్ శేత్. 1980 లో ఆగస్టు 5న వత్సల్ సేథ్ జన్మించాడు. వత్సల్, ఉత్పల్ షాంఘ్వీ గ్లోబల్ స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తి చేసి, ముంబైలోని విలే పార్లేలోని గోకలిబాయి పునమ్‌చంద్ పీతాంబర్ హైస్కూల్‌లో తన ఇంటర్మీడియట్ ను పూర్తి చేశాడు. ముంబైలోని మిథిబాయి కాలేజీ నుండి గణితశాస్త్రంలో పట్టా పొందారు. వత్సల్ మొదట్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనుకున్నాడు.
కాని జస్ట్ మొహబ్బత్‌లో అవకాశం రావడంతో బుల్లితెరపై అడుగుపెట్టాడు. ఆ తరువాత పలు టెలివిజన్ షోలలో నటించారు. ఆ ఆతరువాత బాలీవుడ్ సినిమాలలోనూ నటించాడు. 2004లో వచ్చిన టార్జాన్: ది వండర్ కార్‌ అనే చిత్రంలో రాజ్ చౌదరి అనే పాత్రను చేశాడు. ఇదే అతని మొదటి సినిమా. 2014లో వచ్చిన  థ్రిల్లర్ సిరీస్ ఏక్ హసీనా థీ, 2017లో లవ్-సాగా సిరీస్ హాసిల్ లో నటించి పాపులర్ అయ్యాడు. వత్సల్ నటుడు మాత్రమే కాదు మోడల్ కూడా. 2020లో వత్సల్ శేత్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌ లిస్ట్ లో 36వ ప్లేస్ లో నిలిచాడు. వత్సల్ శేత్ తన సహనటి ఇషితా దత్తాను 2017 లో  వివాహం చేసుకున్నాడు. ఈ జంట తరచు విహారయాత్రలు చేస్తూ, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమాలో ఇంద్రజిత్ గా నటించి, తెలుగు ఆడియెన్స్ కి ముందుకు వచ్చారు.

https://www.instagram.com/p/CoHoNdIryUD/?hl=en

Also Read: “మా నాన్న ఇలా కావడానికి కారణం వాళ్ళే..!”అంటూ… రాకేష్ మాస్టర్ కొడుకు కామెంట్స్..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like