Ads
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా భోళా శంకర్. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా నటించారు. తమన్నా భాటియా చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించారు. అంతేకాకుండా సుశాంత్ కీర్తి సురేష్ పక్కన హీరోగా నటించారు.
Video Advertisement
ఈ సినిమా తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమా రీమేక్. ఆ సినిమా ఇప్పటికే తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. సినిమా టీజర్ లో మెగాస్టార్ చిరంజీవి లుక్ కొత్తగా ఉంది. కానీ టీజర్ చూసిన వాళ్లు అందరూ కూడా చాలా రొటీన్ సినిమాలాగే అనిపిస్తోంది అని అంటున్నారు. మరి కొంతమంది ఏమో రొటీన్ గా ఉన్న పర్వాలేదు కమర్షియల్ సక్సెస్ అందితే చాలు అని అంటున్నారు.
అయితే చిరంజీవి గత కొద్ది సంవత్సరాల నుండి ఎక్కువగా రీమేక్ సినిమాల్లో నటిస్తున్నారు అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా కి సంబంధించి వచ్చే పాటలు, పోస్టర్స్ చూసి కూడా అలాంటి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలి అంటే సినిమా విడుదల అవుతోంది అనే ఆసక్తి చాలా తక్కువగా కనిపిస్తోంది. మరి అసలు హైట్ లేకుండా రిలీజ్ అయ్యి సినిమా పెద్ద హిట్ అవుతుందేమో చూడాలి. ఈ టీజర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
watch video :
End of Article