Ads
తన భార్యను చదివించి గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా చేయడానికి పగలు రాత్రి కష్టపడ్డ తనను ఆమె మోసం చేసింది అని ఓ భర్త తన ఆవేదాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
Video Advertisement
తాను ఇన్ని రోజులు పడ్డ శ్రమకు ఫలితంగా ఈనాడు తన భార్యకు ఉద్యోగం వచ్చినప్పటికీ తను మాత్రం నిరుద్యోగిగా చేతిలో చిల్లిగవ్వ లేకుండా రోడ్డున పడ్డాను అని ఆలోక్ పేర్కొన్నాడు.
వివరాల్లోకి వెళ్తే..ఉత్తరప్రదేశ్ (యుపి)లోని బరేలీ జిల్లా మహిళా సీనియర్ పిసిఎస్ అధికారి జ్యోతి పై ఆమె భర్త తనకు ద్రోహం చేసింది అని ఆరోపిస్తున్నారు. అతను ప్రతాప్ గారి జిల్లాలోని పంచాయతీ రాజ్ లో గ్రేట్ ఫోర్ ఆఫీసర్ గా పని చేస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత జ్యోతి భర్తను వదిలి వేరొక అతనితో ప్రేమాయణం జరుగుతోందని. ఇప్పుడు ఆమె ప్రియుడు వల్లే తన ప్రాణాలకే ప్రమాదం ఉందని ఆలోక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అలోక్ కుమార్ మౌర్య తన భార్య మరియు ఆమె ప్రియుడి పై ధూమన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే ఇంతవరకు అక్కడ కేసు నమోదు కాలేదు. అలోక్ మాటల ప్రకారం అతను తన భార్యను సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) చేయడానికి అహోరాత్రులు కష్టపడ్డాడట. అయితే ఇప్పుడు ఆమె మరొక అధికారితో కలిసి తనని మోసం చేయడానికి కోనుకోవడంతో అతని గుండె పగిలిపోయిందని అతను ఆరోపించాడు.
వారి వివాహం జరిగిన తర్వాత ఆర్థికంగా ఎంతో ఇబ్బందులకు గురి అయినప్పటికీ అతను విశ్రాంతిగా పని చేసి భార్య చదువు కొనసాగే విధంగా చూసుకున్నానని చెప్పారు. 2010 లో అలోక్ కుమార్ మౌర్య మరియు జ్యోతి మౌర్య వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా చదువుకోవాలి అని జ్యోతి తన కోరికను వ్యక్తం చేయడంతో అలోక్ ఆమెకు పూర్తి మద్దతు అందించారు.
జ్యోతి మే 7 2023న ఆమె భర్త మరియు అత్తమామలపై వరకట్న కోసం వేధిస్తున్నారని దావా వేసింది. అయితే ఇటు అలోక్ తన భార్యకు మనీష్ దూబేతో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. ఎవరి మాటల్లో యదార్థం ఉంది అన్న విషయం పై స్పష్టత లేకపోయినప్పటికీ…ఒక మంచి పొజిషన్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడంతో ప్రస్తుతం ఈ న్యూస్ బాగా వైరల్ అయింది.
End of Article