Ads
సూపర్ స్టార్ మహేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తున్న మూడవ చిత్రం గుంటూరు కారం. అతడు మరియు ఖలేజా మూవీలలో మహేష్ బాబు డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ మూవీలో కూడా అంతకుమించి మహేష్ డైలాగ్స్ ఉంటాయి అని అభిమానులు ఆశిస్తున్నారు.
Video Advertisement
నిజానికి ఇప్పటికే విడుదల అయిపోవాల్సిన సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ రావడంతో కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా సెక్స్ పైకి వెళ్ళిన ఈ మూవీని లీక్స్ ఇబ్బంది పెడుతున్నాయి.
మూవీలోని కొన్ని స్టిల్స్ ఏ కాకుండా ఈరోజు ట్విట్టర్ వేదికగా కొని డైలాగ్స్ కూడా లీక్ అయ్యాయి. అయితే ఈ డైలాగ్స్ ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరి మధ్య అనే విషయంపై పూర్తిగా స్పష్టత లేదు.సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ మూవీలో మహేష్ బాబు చిన్నప్పటి వాల్ ఫొటోస్ మరియు శ్రీ లీలా మహేష్ బాబు ఉన్న ఫోటో ఫ్రేమ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
“దెబ్బ పడే ఎప్పుడు నీ…నా అనే తేడా ఉండదు.. బొంద తీసి కూర్చో పెడతారా…”అన్న మాస్ డైలాగ్ ట్విట్టర్ లో లీక్ అయ్యింది. అలాగే “నువ్వు గొప్ప వారితో తిరిగితే నీకు అవే బుద్ధులు వస్తాయి..”అనే మరో డైలాగ్ ని కూడా ట్విట్టర్ లో షేర్ చేయడం జరిగింది.
మొదటి డైలాగ్ ఖచ్చితంగా మహేష్ చెప్పి ఉంటాడు అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి రెండవ డైలాగ్ ఎవరు ,ఏ సందర్భంలో చెప్పారో తెలియదు. దెబ్బ పడే డైలాగ్ మాత్రం కచ్చితంగా ఏదో మంచి మాస్ ఫైట్ డైలాగు అని తెలుస్తోంది. ఒక్క డైలాగ్ ఇంత మాస్ గా ఉంది అంటే మహేష్ చెప్పే మెయిన్ డైలాగ్స్ ఇంకెంత రెచ్చపొట్టిస్తాయో అని అభిమానులు ఆనందిస్తున్నారు.
End of Article