Ads
కోలీవుడ్ హాస్యనటుడు యోగిబాబు డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. కమెడియన్స్ లో యోగిబాబు కోలీవుడ్ లో అగ్రస్థానంలో ఉన్నారు. అక్కడ ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఏడాదికి ఆరు సినిమాలలో నటిస్తాడంటే కమెడియన్ గా ఆయన క్రేజ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. యోగిబాబు ప్రస్తుతం పలు కోలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.
Video Advertisement
కెరీర్ మొదట్లో యోగిబాబు చిన్న చిన్న కామెడీ క్యారెక్టర్లతో నటించాడు. తనదైన కామెడీతో ఆడియెన్స్ ను నవ్వించడంలో సత్తా చాటి యోగిబాబు తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. తాజాగా యోగిబాబు రెమ్యునరేషన్ కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యోగిబాబు రెమ్యునరేషన్ తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
కమెడియన్ యోగిబాబు 2009లో రిలీజ్ అయిన కోలీవుడ్ మూవీ ‘యోగి’ అనే చిత్రం ద్వారా ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ మూవీ తరువాత ఆయనని అందరు యోగి బాబు అని పిలవటం ప్రారంభించారు. ఆయన ఎన్నో సినిమాలలో నటించి ఆడియెన్స్ ను అలరించారు. ఆయన కోసమే స్టోరీలో కామెడీ ట్రాక్ రాస్తుంటారు. యోగి బాబు నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఆ చిత్రాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కు చేరువయ్యాడు.
ఇటీవల కాలంలో లవ్ టుడే సినిమాలో యోగి బాబు పండించిన కామెడీ ఆడియెన్స్ విపరీతంగా ఆకట్టుకుంది. వారసుడు, కాజల్ అగర్వాల్ కోస్టి సినిమాలలో నటించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’ సినిమాలో బిచ్చగాడు క్యారెక్టర్ లో నటించి ఆడియెన్స్ నవ్వించాడు. ప్రస్తుతం యోగి బాబు కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజీనీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమాలో కూడా నటిస్తున్నారు.
ఇప్పుడు యోగిబాబు అందుకుంటున్న పారితోషికం అందరిని షాక్ అయ్యేలా చేస్తోంది. కొందరు కోలీవుడ్ హీరోలు అందుకునే పారితోషికంతో సమానంగా యోగిబాబు పారితోషికం అందుకుంటున్నారు. యోగిబాబు రోజుకు 18 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఒక మూవీకి సుమారు 10 కోట్ల రూపాయల వరకు అందుకుంటున్నారని తెలుస్తోంది.
Also Read: “చిన్మయి” పై వస్తున్న ట్రోల్స్ కి “రాహుల్ రవీంద్రన్” స్ట్రాంగ్ రిప్లై..! ఏం అన్నారంటే..?
End of Article