Ads
2021 డిసెంబర్ 10వ తారీఖున ఎటువంటి అంచనాలు లేకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన చిత్రం ‘మా ఊరి పొలిమేర’. ఈ మూవీ ఎవరు ఊహించని విధంగా ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను అందుకుంది.
Video Advertisement
క్లైమాక్స్ వరకు ఎవరు ఊహించని విధంగా ఉండడంతో ఈ చిత్రం మంచి క్రేజ్ ను సంపాదించింది. అప్పటికి ఇంకా కాంతార కూడా రిలీజ్ కాలేదు. క్లైమాక్స్ రెండు సినిమాలకు ఇంచుమించు ఒకే రేంజ్ లో ఉంటుంది.
ఊహించని బ్యాక్ టు బ్యాక్ టు విస్లతో అండ్ కార్డు పడే వరకు హై టెన్షన్ మెయింటైన్ చేసే ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని అప్పట్లోనే రివిల్ చేయడం జరిగింది. కొద్దిగా గ్యాప్ తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన పార్ట్ 2 విడుదల చేయడం జరుగుతుందని డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ అప్పట్లోనే తెలియపరిచారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ పార్ట్ టీజర్ విడుదల అయింది.
ఊహించినట్లే టీజర్ ఎన్నో ట్విస్ట్ లు, చేతబడి ,కొమరయ్య మళ్ళీ అతని ఫ్యామిలీ వద్దకు రావడం లాంటి సన్నివేశాలు చూపిస్తూ మంచి ఆక్షన్ ఎపిసోడ్స్ కూడా జోడించారు. మొదటి పార్క్ చూసిన వాళ్లకి అందులో కొమరయ్య మరియు అతని లవర్ చనిపోయినట్లు చూపించిన విషయం గుర్తుంటుంది. అలాగే సర్పంచ్ రవి వర్మ కూడా చేతబడి కారణంగా చనిపోయినట్లు చూపిస్తారు.
అయితే ఇప్పుడు విడుదల చేసిన టీజర్ లో కొమరయ్యతో పాటు సర్పంచ్ కూడా కనిపిస్తున్నాడు. మరి ఇది ఫ్లాష్ బ్యాక్ లో చూపించిన ఒక భాగమా లేక సినిమాలో నిజంగా చచ్చిపోయిన వాళ్ళు బతికి వచ్చారా…ఒకవేళ ఇదే నిజమైతే అసలు మూవీ లో ఏం చూపిస్తున్నారు.. అనే విషయం ప్రస్తుతం ఆసక్తిని రేపుతోంది.. మరోపక్క ఈ చిత్రంలో హద్దులు మీరిన బెడ్ రూం రొమాన్స్ తో పాటు బూతులు కూడా విపరీతంగా ఉన్న విషయం తెలిసిందే. కానీ సెకండ్ పార్ట్ కి సంబంధించిన టీచర్లు ఇటువంటి హాట్ సన్నివేశాలు ఏవి కనిపించ లేదు. మరి మూవీ విడుదల అయ్యాక సినిమా ఎలా ఉందో పూర్తిగా అర్థమవుతుంది.
End of Article