అక్కడ అలా… ఇక్కడ ఇలా..! నెల రోజులకే ప్రేక్షకుల టేస్ట్ మారిపోయిందా..?

అక్కడ అలా… ఇక్కడ ఇలా..! నెల రోజులకే ప్రేక్షకుల టేస్ట్ మారిపోయిందా..?

by Mohana Priya

Ads

ప్రస్తుతం కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమా అయినా సరే బాగా క్లిక్ అవుతుంది. అదే పెద్ద సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ స్టోరీ లోవిషయం లేకపోతే మాత్రం బోర్డు తిప్పేయాల్సిందే.

Video Advertisement

ఈ నేపథ్యంలో చిన్న సినిమా అయినప్పటికీ విపరీతమైన ప్రమోషన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన రీసెంట్ ఫిలిం మేము ఫేమస్. హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయినప్పటికీ మూవీ యావరేజ్ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.

తగ్గేదే లేదు అనే విధంగా ఈ మూవీ మేకర్ రెండు వారాలపాటు ప్రమోషన్స్ చేసి మూవీ ని విడుదల చేశారు. ప్రమోషన్ ఈవెంట్స్ కి బాగా కనెక్ట్ అయిన జనం కూడా టాక్ గురించి ఆలోచించకుండా మూవీ ని బాగా ఎంజాయ్ చేశారు. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్‌గా నమోదైన ఈ చిత్రం 6.8 కోట్లు వసూలు చేసింది. ఒక చిన్న సినిమాకి ఇది చాలా పెద్ద బడ్జెట్.. అయితే థియరిటికల్ రన్ పూర్తయిన తర్వాత ప్రస్తుతం ఈ చిత్రం రీసెంట్‌గా ఓటీటీ లో విడుదలయింది.

రిలీజ్ కి ముందు విమర్శలు ఫేస్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం విపరీతమైన ట్రోలింగ్‌కు గురి అవుతుంది. సెకండ్ హాఫ్ నీరసం వచ్చేలా ఉంది అని ఓ రేంజ్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై ఈ చిత్రం మీద ట్రోల్స్ వస్తున్నాయి. కొందరు నటిజన్స్ ఈ చిత్రం పై రకరకాల మీమ్స్ ని సృష్టించి విడుదల చేస్తున్నారు.

అంతా బాగానే ఉంది కానీ సినిమా విడుదలై కలెక్షన్స్ కూడా బాగా వచ్చిన తర్వాత , ఇప్పుడు దాని గురించి ఎంత మాట్లాడినా వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు కదా. పైగా ఈ ట్రోల్స్ చూసి అసలు సినిమాలో ఏముందా అన్న ఉత్సాహంతో ఓటీటీ లో సినిమా చూసే వారి సంఖ్య ఎక్కువ అయిపోయింది. ఈ రకంగా ఈ మూవీకి నెగిటివ్ టాక్ కూడా పాజిటివ్ గా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.

ALSO READ : రామ్ చరణ్-దీపికా పదుకొనే..! అసలు విషయం ఏంటంటే..?


End of Article

You may also like