Ads
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ కేజీఎఫ్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న మూవీ అవడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.
Video Advertisement
ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా శర వేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల అయ్యింది. ఈరోజు (జులై 6న) ఉదయం 5గంటల 12 నిముషాలకు సలార్ టీజర్ ను విడుదల చేశారు. అయితే ఈ టీజర్ పై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.. 1 నిమిషం 46 సెకన్ల నిడివి ఉన్న సలార్ టీజర్ ఆసక్తికరంగా ఉంది. దీనిని చూస్తుంటే కేజీఎఫ్ ఫ్లేవర్ లోనే ఈ మూవీ వస్తున్నట్టుగా అనిపిస్తోంది. టీజర్ లో పవర్ ఫుల్ డైలాగ్ తో ఆకట్టుకుంది. ‘సింహం, ఏనుగు, చీతా చాలా ప్రమాదం. కానీ జురాసిక్ పార్క్ లో కాదు. ఎందుకంటే అక్కడ ఉంది’ అని ఓ పెద్దాయన డైలాగ్ చెప్పినపుడు రెబల్ స్టార్ ప్రభాస్ పేరును చూపించారు.ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. టీజర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ డీఫెరెంట్ లుక్ లో కనిపించారు. ఇది కేజీఎఫ్ లోని అధీరా లుక్ ను పోలీ ఉంది. టీజర్ లో ప్రభాస్ ను క్లియర్ గా చూపించలేదు. ప్రభాస్ విలన్స్ తో ఫైట్ చేస్తున్న సీన్స్ ను చూపించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని టీజర్ చివరలో దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ అంటూ టీజర్ ఎండ్ లో వేశారు. ఇలా ఈ ఈ టీజర్ కేజీఎఫ్ తో రిలేటెడ్ గా ఉంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
1. 2. 3. 4. 5. 6.7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17.18.
watch video :
Also Read: విడాకులు తీసుకొని విడిపోయిన 16 సెలబ్రిటీ కపుల్స్…లిస్ట్ లో వీళ్ళని అసలు ఊహించి ఉండరు.!
End of Article