Ads
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ టీజర్ ను తాజాగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘కేజీయఫ్’ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్‌ను ఓ రేంజ్‌లో ఈ టీజర్‌లో చూపించాడు.
Video Advertisement
అయితే కేజీఎఫ్ తో సలార్ మూవీకి కనెక్షన్ ఉందని, ఉంటుందని చాలా రోజుల నుండి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన సలార్ టీజర్ తో ఆ విషయన్ని నెటిజెన్లు కన్ఫర్మ్ చేస్తూ కొన్ని ఆధారాలను నెట్టింట్లో షేర్ చేయగా, అవి వైరల్ గా మారాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తాజాగా రిలీజ్ అయిన సలార్ టీజర్‌లో నెటిజెన్లు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను గుర్తించారు. దాంతో కేజీఎఫ్‌తో సలార్ మూవీకి కనెక్షన్ ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో రాఖీ భాయ్ కూడా ఉంటారు అనే విషయానికి మరింతగా బలం చేకూరినట్టు అయ్యింది. ఇది ప్రభాస్ సలార్, రాఖీ భాయ్ మధ్య ఉన్న పెద్ద క్రాసర్‌ను సూచిస్తుంది.
సలార్ టీజర్ చూసిన అనంతరం కేజీఎఫ్-2 కు తప్పకుండా సంబంధం ఉందని అంటున్నారు. అది నిజమేనని చెప్పడానికి రెండు ఫోటోలను నెటిజెన్లు గుర్తించారు. కేజీఎఫ్-2, సలార్ టీజర్ కు సినిమాలకు సంబంధించిన 2 స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోలను చూస్తుంటే కేజీఎఫ్‌తో సలార్‌కు సంబంధం ఉందని అనిపిస్తుంది. చాలా రోజుల నుండి సలార్ మూవీలో రాఖీ భాయ్ పాత్ర కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఈ సన్నివేశాలు ఉన్నాయి. టీజర్‌లో వీటికి సంబంధించిన క్లూస్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చాడు. ఒక వేళ ఇదే నిజం అయితే ప్రభాస్, రాఖీ భాయ్ ఇద్దరు ఒకే తెరపై కనిపిస్తే ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవుతుందని అంటున్నారు. ప్రభాస్, యశ్ ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు. ఒకరి మూవీ రిలీజ్ అయితేనే బాక్సాఫీస్ బద్దలవుతుంది. ఇక ఇద్దరు ఒకే సినిమాలో నటిస్తే భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక ఓపెనింగ్స్ గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చి… సక్సెస్ అవ్వలేకపోయిన 9 హీరోయిన్స్..!
End of Article