Home Filmy Adda భారతీయ సినీ ఇండస్ట్రీ గురించి “ప్రియాంక చోప్రా” కామెంట్స్..! ఏం అన్నారంటే..?

భారతీయ సినీ ఇండస్ట్రీ గురించి “ప్రియాంక చోప్రా” కామెంట్స్..! ఏం అన్నారంటే..?

by Mohana Priya

Ads

దక్షిణాది సినిమాలతో మూవీ కెరియర్ ను ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి ప్రియాంక చోప్రా. క్రమంగా హాలీవుడ్ లో కూడా తన సత్తాను చాటి ఇటు సినిమాలు అటు వెబ్ సిరీస్ తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈమె.

Video Advertisement

అయితే తాజాగా ప్రియాంకకు సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అంతేకాదు ఈ వీడియో చూసిన అందరూ ప్రియాంకను పలు రకాలుగా విమర్శిస్తున్నారు కూడా.

వివరాల్లోకి వెళ్తే అసలు ఈ వీడియో 2016 వ సంవత్సరం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ దగ్గర జరిగిన ఎమ్మీ అవార్డ్స్ కార్యక్రమానికి సంబంధించినది. ఆ అవార్డు ఫంక్షన్‌లో ఒక అంతర్జాతీయ మీడియాకు చెందిన యాంకర్ తో మాట్లాడుతూ భారతీయ సినిమాలపై ప్రియాంక తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడిన మాటలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

6 priyanka chopra

తాను వచ్చింది భారతీయ సినీ ఇండస్ట్రీ నుంచి అని మర్చిపోయినట్లుగా ప్రియాంక మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చాలావరకు భారతీయ సినిమాలంటేనే శరీర భాగాల కు పరిమితమై ఉంటాయి. కరెక్ట్ గా చెప్పాలంటే ఎక్స్పోజ్ చేస్తే సరిపోతుంది అని అర్థం వచ్చేలా మాట్లాడిన ప్రియాంక తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Bollywood heroines Instagram followers

ప్రియాంక నటిస్తున్న హాలీవుడ్ సిరీస్ ‘సిటడెల్’ రీసెంట్ గా విడుదల కావడం జరిగింది. దీంతో ప్రస్తుతం ప్రియాంక సెర్చింగ్ టాపిక్ గా మారి. ఈ నేపథ్యంలో ఆమె ఇండియన్ సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడిన తీరుపై సోషల్ మీడియాలో ” భారతీయ చలనచిత్రాల గురించి అంతర్జాతీయ వేదికపై ఇంత చీప్ గా మాట్లాడిన ప్రియాంకను ఇండియన్ సినిమాల నుంచి బ్యాన్ చేయాలి”అని కొందరు కోరుతున్నారు.

ALSO READ : విడాకులు తీసుకొని విడిపోయిన 16 సెలబ్రిటీ కపుల్స్…లిస్ట్ లో వీళ్ళని అసలు ఊహించి ఉండరు.!


End of Article

You may also like