Ads
మెగాస్టార్ చిరంజీవి బి.గోపాల్ దర్శకత్వంలో నటించిన ‘ఇంద్ర’ మూవీ రిలీజ్ అయ్యి ఇరవై సంవత్సరాలు అయ్యింది. మెగాస్టార్ అభిమానులు ఈ చిత్రాన్ని అంత ఈజీగా మరిచిపోలేరని చెప్పవచ్చు. అప్పటి దాకా ప్లాప్ ఎదుర్కొన్న మెగాస్టార్ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.
Video Advertisement
ఈ చిత్రంలోని డైలాగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఈ సినిమాలోని డబ్బింగ్ కి ముందు ఒక సన్నివేశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఇంద్ర’. ఈ మూవీని అశ్వినీదత్ ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై నిర్మించారు. చిరంజీవి నటించిన మృగరాజు, డాడీ, శ్రీమంజునాథ లాంటి సినిమాలు ప్లాప్ అవడంతో ‘ఇంద్ర’ మూవీ పై అంతగా అంచనాలు ఏర్పడలేదు.
ఈ మూవీ 2002 జూలై 24న రిలీజ్ అయ్యింది. మొదటి షోతొనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా రికార్డులు సృష్టించింది. 122 సెంటర్స్ లో 100 రోజులు, 32 సెంటర్స్ లో 175 రోజులు రన్ అయ్యి రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రంలో ఒక సీన్ లో చిరంజీవి తన మేనకోడలు సీమంతానికి పిలవడం కోసం ఆర్తి అగర్వాల్ ఇంటికి వచ్చినపుడు ఆర్తి అగర్వాల్ కొన్ని డైలాగ్స్ చెబుతుంది. అయితే డబ్బింగ్ చెప్పక ముందు ఆ సీన్ లో ఆర్తి అగర్వాల్ ఎలా డైలాగ్స్ చెప్పిందో తెలిపే ఒక వీడియోని ఎంటర్టైన్మెంట్ మాషప్ అనే ఇన్ స్టా పేజ్ లో షేర్ చేశారు. ఆ సీన్ లో ఆర్తి అగర్వాల్ తనకు తెలుగు డైలాగ్స్ సరిగ్గా చెప్పలేకపోతుంది. ‘నవ్వు ఆపుకుని డైలాగ్స్ ఎలా చెప్పావ్ చిరు’ అని ఆ వీడియో కి క్యాప్షన్ ఇచ్చారు. దానిపై నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
watch video :
https://www.instagram.com/reel/CuUVSCwANgr/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: RANGABALI REVIEW : “నాగ శౌర్య” ఈ సినిమాతో హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
End of Article