Home Filmy Adda నాగ శౌర్య “రంగబలి” రెస్పాన్స్ ఎలా ఉందంటే..?

నాగ శౌర్య “రంగబలి” రెస్పాన్స్ ఎలా ఉందంటే..?

by Mohana Priya

నాగశౌర్య మరియు యుక్తి తరేజా జంటగా నటిస్తున్న రంగబలి జూలై 7వ తారీకు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను పవన్ బాసంశెట్టి నిర్వహిస్తున్నారు. ఈ మూవీతో పవన్ డైరెక్టర్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. యాక్షన్ మరియు కామెడీ ఎంటర్టైనర్‌గా తరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ రివ్యూ పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది. వినూత్నమైన పాత్రలను ఎంచుకోవడమే కాకుండా పక్కింటి కుర్రాడు తరహాలో ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచుకున్న యాక్టర్ నాగశౌర్య. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌ పై చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా చిత్రంలో విలన్ గా అందరినీ మెప్పించిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ మూవీలో స్ట్రాంగ్ నెగటివ్ రోల్ లో కనిపించనున్నారు.

rangabali movie review

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం జూలై 7న థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో మంచి మాస్ ట్రీట్ తో పాటు ఎంటర్టైనింగ్ యాక్షన్స్ అన్ని వేసాను కూడా మస్తుగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ చిత్రంపై మంచి పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది.

rangabali movie review

ఈ చిత్రంలో తన ఊరి పై అమితమైన ప్రేమ ఉన్న యువకుడి పాత్రలో నాగశౌర్య కనిపిస్తాడు. ఎప్పుడు ఫ్రెండ్స్ తో హ్యాపీగా తిరిగే అతనికి డాక్టర్ అయినా హీరోయిన్ కి పరిచయం ఏర్పడిన తర్వాత అతని జీవితంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి అనే విషయం చుట్టూ కథ తిరుగుతుంది.ఈ క్రమంలో అనుకోకుండా లోకల్ లీడర్‌తో హీరోకి వైరం ఏర్పడుతుంది…ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇందులో నాగశౌర్య యాక్షన్ మునుపటి చిత్రాలతో పోలిస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.

You may also like