Ads
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే రాకేశ్ మాస్టర్ చనిపోయిన అనంతరం కూడా ఆయన పేరుతో ఇంకా వివాదాలు జరుగుతున్నాయి. రాకేష్ మాస్టర్ మూడవ భార్య లక్ష్మి మీద తాజాగా కొంతమంది దాడి చేశారు.
Video Advertisement
హైదరాబాద్ పంజాగుట్టలో లక్ష్మి మీద శుక్రవారం ఒక్కసారిగా ఐదుగురు మహిళలు దాడి చేశారు. యూట్యూబర్ లల్లీ మరో నలుగురితో కలిసి లక్ష్మి మీద దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
రాకేష్ మాస్టర్ ఇంటికి వంట చేయడం కోసం వచ్చిన లక్ష్మిని మాస్టర్ తన భార్యగా అందరికి చెప్పిన విషయం తెలిసిందే. రాకేష్ మాస్టర్ లక్ష్మితో సరదాగా మాట్లాడుతూ, తనతో సహజీవనం చేస్తున్నానని ఆయన గతంలో తన యూట్యూబ్ ఛానెల్ వీడియోలలో చెప్పారు. అయితే, ఆ యూట్యూబ్ ఛానెల్‌ను రాకేష్ మాస్టర్ నుండి లక్ష్మి లాక్కున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్ష్మి రాకేష్ మాస్టర్‌తో 3 సంవత్సరాలు సహజీవనం చేసిన తరవాత వారిద్దరూ గొడవలతో విడిపోయారని తెలుస్తోంది.
రాకేష్ మాస్టర్ నుంచి లాక్కున్న ఛానెల్ కోసం ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ప్రయత్నిస్తున్నారని, వారికి యూట్యూబర్ లల్లీ హెల్ప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లక్ష్మికి, లల్లీకి, మధ్య గొడవలు అవుతున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం నాడు లక్ష్మి స్కూటర్ పై వెళ్తున్న సమయంలో అడ్డగించి లల్లీ, ఇంకో నలుగురు మహిళలు లక్ష్మి పై దాడి చేశారని, ఇష్టం వచ్చినట్టుగా చితక్కొట్టారని, ఆ సమయంలో స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
లక్ష్మిని పోలీస్ స్టేషన్‌కు తరలించగా, ఆమె తనపై దాడి చేసిన వారి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తరువాత మీడియాతో లక్ష్మీ ఇలా చెప్పుకొచ్చారు. ‘తనను 2 నెలలుగా చంపేస్తామని బెదిరిస్తున్నారని, ఇవాళ తన మీద దాడి చేశారని, నెల్లూరు భారతి అనే మహిళ ఇలా చేయించిందని ఆరోపించారు. తన యూట్యూబ్ ఛానెల్ ను వదిలివేయాలని కొన్ని రోజుల నుండి బెదిరిస్తున్నారు. తన పై దాడి చేసిన వారిలో లల్లీ, పెరుగు పెద్దమ్మ, నెల్లూరుకు చెందిన భారతి, దుర్గ, మరో మహిళ ఉన్నారు’ అని వెల్లడించారు.
watch video :
Also Read: చంటి సినిమాలో మీనా పడుకున్న మంచం వాడితే ఏ సినిమా అయినా సూపర్ హిట్..!!
End of Article