Home Filmy Adda “పాట ఏంటి ఇలా ఉంది..?” అంటూ… “పవన్ కళ్యాణ్” బ్రో ఫస్ట్ సాంగ్ పై 10 ట్రోల్స్..!

“పాట ఏంటి ఇలా ఉంది..?” అంటూ… “పవన్ కళ్యాణ్” బ్రో ఫస్ట్ సాంగ్ పై 10 ట్రోల్స్..!

by Mohana Priya

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రో. ఈ సినిమా తమిళ్ సినిమా అయిన వినోదయ సిత్తం సినిమాకి రీమేక్ గా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో పవన్ కళ్యాణ్ గెటప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అంతకు ముందు గోపాల గోపాల సినిమాలో కూడా దేవుడి పాత్రలో నటించారు.

trending trolls on pawan kalyan bro first song

కానీ రెండు సినిమాల్లో కూడా పాత్ర డిఫరెన్స్ ఉండేలా చూసుకున్నారు అని తెలుస్తోంది. ఈ సినిమా మీద అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్నారు. టీజర్ లో ఉన్న డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అని అర్థం అయ్యేలాగా ఉన్నాయి.

ఈ సినిమాలో మార్కండేయ పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమా పాట ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహించారు. అయితే పాట విన్నవారు మాత్రం చాలా రొటీన్ గా ఉంది అని అంటున్నారు. పాట నుండి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము అని చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13

watch video :

You may also like