బాలేశ్వర్‌ రైల్వే దుర్ఘటనకు వీరి నిర్లక్ష్యమే కారణమా?

బాలేశ్వర్‌ రైల్వే దుర్ఘటనకు వీరి నిర్లక్ష్యమే కారణమా?

by Mohana Priya

Ads

మొత్తం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఒడిశాలోని బాలేశ్వర్‌ రైల్వే దుర్ఘటన లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనకు ఏదన్న కుట్ర కారణంగా ఉందా అన్న విషయంపై సిబిఐ చేసిన దర్యాప్తులో ముగ్గురు ఇండియన్ రైల్వే ఉద్యోగులు అరెస్టు చేయబడ్డారు.

Video Advertisement

సిగ్నలింగ్‌ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మెహతా, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌ లను సిబిఐ నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకుంది.

ఈ ముగ్గురు చేసినటువంటి చర్యలే ప్రమాదానికి కారణమని సిబిఐ వెల్లడిస్తుంది. వాళ్లు చేస్తున్నటువంటి పని కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా వాళ్ళు గమ్ముగా ఉన్నారు అని సిబిఐ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఈ ముగ్గురు ఉద్యోగులపై 304 మరియు 201 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. జూన్ 2 రాత్రి 7:00 సమీపంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఎందరో గాయపడగా వందల కొద్ది ప్రాణాలు అన్యాయంగా బలైపోయాయి.

కుట్రతో కూడుకున్న ప్రమాదం అన్న అనుమానంతో రంగంలోకి దిగిన సిబిఐ ఈ యాక్సిడెంట్ కు కారణం కుట్ర కాదు కేవలం ముగ్గురు ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి అని తన దర్యాప్తులో తేల్చింది. సిగ్నలింగ్ మరియు టెలి కమ్యూనికేషన్ విధులు నిర్వహిస్తున్నటువంటి ఈ ఉద్యోగులు సరియైన విధంగా స్పందించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నివేదికలో పేర్కొంది.

సదరు ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగానే లూప్ లైన్ లో ఆగి ఉన్నటువంటి గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొనడం ఆ తర్వాత పక్కన ట్రాక్ పై పడ్డ దాని భోగిలను మరో ఢీకొట్టడం జరిగిందని ఈ నివేదికలో తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు వేయి మందికి పైగా గాయపడగా 293 మంది మరణించారు. అయితే ఇప్పటికీ అందులో చాలా మృతదేహాలు గుర్తించడానికి కూడా వీలులేని విధంగా ఉన్నాయి.


End of Article

You may also like