Ads
స్మార్ట్ ఫోన్లు వచ్చిన తరువాత ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటం బాగా పెరిగిపోయింది. పిల్లల దగ్గరి నుండి పెద్ద వాళ్ల దాకా అందరు గేమ్ లు ఆడుతున్నారు. కొందరు వీటికి అడిక్ట్ అవుతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచాన్ని మరిచి దానిలో లీనమవుతున్నారు. ఇక గేమ్స్ లో పబ్జీ గేమ్ కుండే క్రేజ్ వేరు.ఈ గేమ్ ని ఇండియాలో బ్యాన్ చేసినా కూడా కొంతమంది ఇతర మార్గాలలో పబ్జీని డౌన్‌లోడ్ చేసుకొని ఆడుతునేవున్నారు.
Video Advertisement
తాజాగా ఈ గేమ్ ఒక ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది. ఈ గేమ్ లో పరిచమైన వ్యక్తి కోసం ఒక మహిళ తన భర్తను, తన దేశాన్ని విడిచి తన పిల్లలతో కలిసి పాకిస్తాన్ నుండి ఇండియాకు చేరుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
పాకిస్థాన్ మహిళ సీమా గులామ్ హైదర్ కు నోయిడాకు చెందిన సచిన్‌కు పబ్జీ గేమ్ ద్వారా పరిచయం కలిగింది. అయితే మహిళకు అప్పటికే పెళ్లి జరిగి, నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. సీమా, సచిన్ పబ్జీలో నిత్యం చాటింగ్ చేసేవారు. వీరి పరిచయం తరువాత ప్రేమగా మారింది. దాంతో ప్రియుడు కోసం పెళ్లి చేసుకున్న భర్తను విడిచి పెట్టేందుకు సైతం సిద్ధ పడింది.
సీమా గులామ్ హైదర్ తన నలుగురు పిల్లలను తీసుకుని సచిన్ నివసించే ఉత్తరప్రదేశ్‌కు ప్రయాణం అయ్యింది. పాకిస్తాన్ నుండి నేపాల్ మీదుగా అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించి, ఉత్తరప్రదేశ్ చేరుకుంది. బస్సులో గ్రేటర్ నోయిడాకు వచ్చింది. ఆ తరువాత సచిన్ అక్కడే ఒక ఇల్లు రెంట్ కు తీసుకుని జీవించడం మొదలు పెట్టారు. అయితే పాకిస్థాన్ మహిళ అక్రమంగా జీవిస్తున్నట్టు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సచిన్, సీమాను అదుపులోకి తీసుకున్నారు. తమకు కోర్టు పెళ్లి జరిగిందని, నలుగురు పిల్లలున్నట్లుగా వారు చెప్పారని అద్దెకు ఇల్లు ఇచ్చిన ఓనర్ బ్రిజేష్ పోలీసులకు వెల్లడించారు. అయితే సీమా కట్టు, బొట్టు చూస్తే, ఆమె పాకిస్తాన్ మహిళ అనే సందేహం రాలేదని అన్నారు.
Also Read: భార్య ఆనందం కోసం ఎవరూ చేయని పని చేశాడు..! ఈ సంఘటన చూస్తే కన్నీళ్లు ఆగవు..!
End of Article