Ads
టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మనిషి సంపాదించే విధానంలో కూడా పలు రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యూట్యూబర్‌గా నెలకి 30 లక్షల ఆదాయం తెచ్చుకున్నాడు అంటే మాటలా చెప్పండి.
Video Advertisement
ఇంతకీ ఆ ఘటికుడు ఎవరో అనుకుంటున్నారా…. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది అదేనండి అన్వేషణ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్‌ని స్టార్ట్ చేసి ప్రపంచం మొత్తం చుట్టేస్తూ మనకు వింతలను చూపిస్తున్న యూట్యూబర్ అవినాష్.
ఎవరు ఊహించని విధంగా కొన్ని మిలియన్ల వ్యూస్ మరియు లక్షల ఆదాయం సంపాదిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఈ యూట్యూబర్. స్వశక్తి మరియు తెలివితేటలు ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు అని ఇతను మరొకసారి నిరూపించాడు. అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచించి తన క్రియేటివిటీని ఉపయోగించి యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసుకుంటే ఎవరైనా ఆదాయం సంపాదించవచ్చు అనడానికి ప్రస్తుతం ఇతనే నిదర్శనంగా చూపిస్తున్నారు.
తాజాగా యూట్యూబర్ అవినాష్ తన నెల రోజులకు సంబంధించిన యూట్యూబ్ ఆదాయం గురించి ఓ వీడియోలో తెలియపరచి అందరినీ షాక్‌కి గురి చేశారు. అతనికి వచ్చిన ఆదాయం వేళల్లో వందల్లో లేదు ఏకంగా 30 లక్షలు…ఈ విషయాన్ని అతనే స్వయంగా ఒక వీడియోలో స్పష్టం చేశాడు. వివరాల్లోకి వెళ్తే శోధించి సాధించు అనే విషయాన్ని మెయిన్ టాపిక్ గా చేసుకున్న యూట్యూబర్ అవినాష్ ప్రపంచ దేశాలను చుట్టేస్తూ తన డిఫరెంట్ కంటెంట్తో వీడియోలను పోస్ట్ చేసి లక్షల్లో వ్యూస్ పొందుతున్నాడు.
ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న ఇతను నెలరోజుల వ్యవధిలో తన ఆదాయం మూడు లక్షల వరకు వచ్చినట్లు యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకి 30 లక్షల రూపాయల ఆదాయం సంపాదించడం అంటే మామూలు విషయం కాదు కదా. దాని వెనక అతని కృషి ఎంతో ఉంది అన్న విషయం అందరూ గమనించాలి.
ఛానల్ ప్రారంభించిన మొదటిలో అంతంత మాత్రం ఆదాయం వచ్చినప్పటికీ ఎక్కడా నిరాశ చెందకుండా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని నిరంతరం ముందుకు సాగడం వల్లే అతను ఈరోజు ఇటువంటి సక్సెస్ సాధించగలిగాడు. అందుకే అంటారు కృషితో నాస్తి దుర్భిక్షం అని.
End of Article