Ads
మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత కొంతకాలంగా నిహారిక తన భర్త చైతన్యతో విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ, షాకింగ్ విషయం తెలిపింది.
Video Advertisement
నిహారిక జూలై 5న తన ఇన్ స్టా ఖాతాలో స్టేట్‌మెంట్ విడుదల చేస్తూ, ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు వెల్లడించింది. ఆ తరువాత చైతన్య జొన్నలగడ్డ కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తాజాగా చైతన్య తండ్రి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు వీరి విడాకుల విషయం పై స్పందించినట్లుగా సమాచారం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
2020 డిసెంబర్‌లో మెగాడాటర్ నిహారిక, చైతన్యల జొన్నలగడ్డ వివాహం గ్రాండ్ గా జరిగింది. మెగా ఫ్యామిలీ అందరు కలిసి వీరి పెళ్లి వేడుకను ఘనంగా జరిపిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో భారీగా ఖర్చు పెట్టి, రాజస్థాన్ ప్యాలెస్ లో నిహారిక, చైతన్యల పెళ్లి జరిపించారు. అప్పట్లో వీరి పెళ్లి గురించి దేశవ్యాప్తంగా మీడియా కవరేజ్ చేసింది. నిహారిక పెళ్లి కోసం సుమారు రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ జంట అన్యోన్యంగా కనిపించింది.
కానీ గత కొంతకాలం నుండి నిహారిక, చైతన్యలు విడి విడిగా ఉంటున్నారని, విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. వీటి పై మెగా కుటుంబంలోని వారెవరూ స్పందించలేదు. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ నిహారిక, చైతన్యల జొన్నలగడ్డకు విడాకులు మంజూరు చేసినట్లు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టు వెల్లడించింది. ఇదే విషయన్ని నిహారిక, చైతన్య సోషల్ మీడియా వేదికగా తెలిపారు. నిహారిక చైతన్యలు ఎందుకు విడిపోయారనే విషయం అయితే బయటికి రాలేదు. ఫిల్మీ ఫోకస్ కథనం ప్రకారం, ఈ క్రమంలో చైతన్య జొన్నలగడ్డ తండ్రి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు నిహారిక చైతన్యల విడాకుల పై వస్తున్న వార్తల గురించి తన సన్నిహితుల దగ్గర ఇలా చెప్పుకొని చాలా బాధపడ్డారట. ‘తాను గౌరవప్రదమైన హోదాలో బ్రతికాను, మెగా కుటుంబం అంటే చాలా గౌరవం ఉన్న ఫ్యామిలీ అని భావించాను. కానీ తన కుమారుడు చైతన్య గురించి మెగా ఫ్యాన్స్ తప్పుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను’ అని అన్నట్టుగా తెలుస్తోంది.
Also Read: అసలైన వంటలక్క అంటే ఇలాగే ఉంటుంది ఏమో..? ఈ సినిమా చూశారా..?
End of Article