Ads
ఉత్తరాది రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను భయందోళనకి గురి చేస్తున్నాయి. వర్షాలు ఏకధాటిగా కురుస్తుండడంతో నదులు పోటెత్తుతున్నాయి. ఆకస్మికంగా వచ్చిన వరదల్లో రహదారులు, వాహనాలు, కొట్టుకుపోయాయి. నివాసప్రాంతాలు, పంటపొలాలు వరదల్లో మునిగాయి. ఇళ్లు కూలి కొందరు, కొండచరియలు విరిగిపడడంతో మరికొందరు మృతి చెందారు.
Video Advertisement
ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్ వంటి ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలు వర్షాల వల్ల అతలాకుతలం అవుతున్నాయి. వర్షపాతం రికార్డు స్థాయిలో పలు రాష్ట్రాల్లో రికార్డ్ అయ్యింది. భారీ వర్షాలకు రాష్ట్రాలు వణికిపోతున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్, సట్లేజ్, రావి లాంటి నదులు ప్రమాదకర స్థాయిని ధాటి ప్రవహిస్తున్నాయి. దాంతో ఆ నదుల పై నిర్మించిన రిజర్వాయర్లల్లో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది. ఆ రిజర్వాయర్ల గేట్లన్నింటినీ అధికారులు ఎత్తివేశారు. వాటి ప్రభావం వల్ల బియాస్, సట్లేజ్, రావి తీరప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోయాయి. అక్కడ నివసించే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
లక్ష మందికి పైగా ప్రజలను ఇప్పటివరకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక కొండ ప్రాంతాల నుంచి వచ్చిన వరద ప్రవాహంతో పలు పట్టణాలు కూడా సగం వరకు మునిగాయి. బిలాస్‌పూర్, కాంగ్రా, సోలన్, సిర్మౌర్, సిమ్లా, ఉనా, మండి, హమీర్‌పూర్, కుల్లు-మనాలి, చంబా, కిన్నౌర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురావడంతో కొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే ఆయా జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది.
వర్షాలు ఇతర జిల్లాలకు కూడా విస్తరిస్తాయని, అందువల్ల ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని ఐఎండీ సూచించింది. భారీ వర్షాల దృష్ట్యా హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 24 గంటలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసింది. ఈ 3 రోజులలో భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 72 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. నాలుగు వేల కోట్లు విలువ చేసే ఆస్తి నష్టం జరిగినట్టు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ డిపార్ట్మెంట్ తెలిపింది.
Also Read: కథ ఒకటే… కారణాలు వేరే..! ఏం జరిగిందంటే..?
End of Article