Home Filmy Adda అసలు ఎవరు ఈ “నితిన్” ..? ఇతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

అసలు ఎవరు ఈ “నితిన్” ..? ఇతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by Mohana Priya

ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే ఎంట్రీ ఇవ్వడం చాలా ఈజీ అని అందరూ అనుకుంటారు. కానీ చాలా సందర్భాలలో అలా వచ్చినప్పటికీ నిలబడడం ఎంతో కష్టం అవుతుంది. ఇదే విషయం నార్నే నితిన్ విషయంలో కూడా జరుగుతుంది ఏమో అన్న అనుమానం అక్కడక్కడ వినిపిస్తుంది.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో నితిన్ హీరోగా నటిస్తున్న రెండవ చిత్రం పూజా కార్యక్రమం లాంఛనంగా ఈరోజు మొదలైంది.ఈ మూవీకి నిర్మాతలగా ‘బ‌న్నీ’ వాస్‌, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు.

who is narne nithiin

ఈ మూవీ ద్వారా అంజిబాబు కంచిప‌ల్లి డైరెక్టర్ గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ రోజు చిత్రానికి సంభందించిన పూజ కార్యక్రమం అన్న‌పూర్ణ గ్లాస్ హౌస్‌లో జరిగింది. అయితే అతను నటిస్తున్న మొదటి చిత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు. ముహూర్తం షాట్‌కి బడా నిర్మాత దిల్ రాజ్ కెమెరా స్విచ్ ఆన్ చెస్తే…అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ క్లాప్ ఇవ్వడం జరిగింది. ‘కార్తికేయ 2’ మూవీ తో మంచి పాన్ ఇండియా సక్సెస్ సంపాదించిన డైరెక్టర్ చందు మొండేటి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

who is narne nithiin

ఈ మూవీకి సంబందించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.అతను హీరోగా చేస్తున్న శ్రీ శ్రీ శ్రీ రాజా వారు దాని గురించి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. ఇప్పుడు మళ్లీ ఈ చిత్రం కొత్తగా ప్రారంభమైంది.ఒకపక్క నితిన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడం పై ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఇప్పటికి కూడా ఒక్క చిత్రం పూర్తి కాకపోవడం అందరిని కన్ఫ్యూజ్ చేస్తోంది.

who is narne nithiin

ఈ నేపథ్యంలో అసలు అతని మొదటి చిత్రం ఏమిటి అన్న విషయంపై కూడా చర్చ జరుగుతుంది. కనీసం ఈ చిత్రమైన పూర్తి అవుతుందా లేక దీనికంటే ముందు మరో చిత్రానికి ముహూర్తం అనౌన్స్ చేస్తారా అన్న డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి.

You may also like