Baby Review : “ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్” నటించిన బేబీ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Baby Review : “ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్” నటించిన బేబీ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా బేబీ. ప్రేమ కథగా రూపొందిన ఈ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీమియర్ ఒక రోజు ముందే జరిగింది. దాంతో రివ్యూ కూడా ముందే వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : బేబీ
  • నటీనటులు : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్.
  • నిర్మాత : శ్రీనివాస కుమార్ (SKN)
  • దర్శకత్వం : సాయి రాజేష్
  • సంగీతం : విజయ్ బల్గేనిన్
  • విడుదల తేదీ : జులై 14, 2023.

baby movie review

స్టోరీ :

ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో సినిమా మొదలవుతుంది. అందులో ఆనంద్  (ఆనంద్ దేవరకొండ), వైష్ణవి (వైష్ణవి చైతన్య) స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుండి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్టు చూపిస్తారు. వైష్ణవి చైతన్య తండ్రి నాగబాబు. బస్తీలో ఉండే వీరు ప్రేమించుకున్న తర్వాత వీరి కథ అనుకోని మలుపు తిరుగుతుంది. టెన్త్ ఫెయిల్ అయిన ఆనంద్ అక్కడే ఉండిపోగా, ఇంటర్ పాస్ అయిన వైష్ణవి పై చదువుల కోసం అని కాలేజ్ లో చేరుతుంది. ఒక పక్క వైష్ణవి కొత్త పరిచయాలతో, కొత్త లైఫ్ స్టైల్ తో మెల్లగా డెవలప్ అవుతుంది.

baby movie review

కాలేజ్ లో విరాజ్ (విరాజ్ అశ్విన్) తో పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారుతుంది. కానీ ఆనంద్ మాత్రం కొన్ని కారణాల వల్ల అప్పుల్లో మునిగిపోయి అవి తీర్చడానికి కష్టాలు పడుతూ ఉంటాడు. ఇద్దరికీ మధ్య ఇక్కడ గొడవలు మొదలవుతాయి. తర్వాత వైష్ణవిలో వచ్చిన మార్పు ఏంటి? దానికి ఆనంద్ ఎలా రియాక్ట్ అయ్యాడు? వారి జీవితాల్లో ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? తర్వాత వైష్ణవి ఏం చేసింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

సినిమా ట్రైలర్ చూస్తే ఇది ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని అర్థం అవుతోంది. ఒక రకంగా చెప్పాలి అంటే సినిమా మెయిన్ పాయింట్ అనేది మనకి ట్రైలర్ లోనే చూపించేశారు. కానీ సినిమాపై ఆసక్తి కలగడానికి ముఖ్య కారణం ఆ సినిమా టేకింగ్ ఎలా ఉంటుంది అని అందరూ చూశారు. ఒక కథని పోలిన కథతో సినిమాలు రావడం అనేది చాలా సహజం. కానీ టేకింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటే ఆ సినిమా రిజల్ట్ మాత్రం వేరే లాగా ఉంటుంది.

baby movie review

అలా సాధారణ కథతో పెద్ద హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే చాలా మంది ప్రేమికులు ఎదుర్కొనే సమస్యలను ఈ సినిమాలో చూపించారు. సాధారణంగా చాలా సినిమాల్లో ప్రేమ అంటే అదేదో ఒక మంచి అనుభూతి అన్నట్టు చూపిస్తారు. కానీ ఈ సినిమాలో అసలు ప్రేమ రియాలిటీ అనేది ఎలా ఉంటుంది అనేది చూపించారు. ఎన్ని కష్టాలు ఎదుర్కొంటే అసలు వారి ప్రేమ ఒక తీరానికి చేరుతుంది అనే విషయాన్ని ఇందులో చాలా బాగా చూపించారు.

baby movie review

సినిమాలో యువతకి నచ్చే అంశాలు, వారు కనెక్ట్ అయ్యే ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ సినిమాకి అతి పెద్ద ప్లస్ మాత్రం డైలాగ్స్. మరీ పోయేటిక్ గా రాయకుండా, అలా అని ఏదో భారీగా రాయకుండా, ఒక సాధారణ ప్రేక్షకుడికి అర్థం అయ్యేలాగా సింపుల్ గా ఉంటూనే చాలా సందేశాత్మకంగా ఉన్నాయి. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వైష్ణవి చైతన్య రెండు షేడ్స్ ఉన్న పాత్రలో చాలా బాగా చేశారు. విరాజ్ అశ్విన్ కూడా బాగా నటించారు.

baby movie review

కానీ సినిమాకి హైలైట్ మాత్రం ఆనంద్ దేవరకొండ. గత సినిమాలతో పోలిస్తే ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో చాలా ఇంప్రూవ్ అయ్యారు అని అనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్స్ విషయంలో కానీ, డైలాగ్స్ చెప్పే విధానంలో కానీ అంతకుముందు సినిమాలతో పోలిస్తే ఆనంద్ లో చాలా మార్పు వచ్చింది. అలాగే సినిమాకి మరొక పెద్ద ప్లస్ పాయింట్ పాటలు.

baby movie review

సినిమా రిలీజ్ అయ్యేముందే పాటలు చాలా హిట్ అయ్యాయి. లిరికల్ వీడియో రూపంలో ఎంతో పెద్ద హిట్ అయిన ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాట చూడడానికి కూడా చాలా బాగుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో కామెడీ తో పాటు ఎమోషన్స్ కూడా చూపించారు. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. దాంతో సెకండ్ హాఫ్ నిడివి కూడా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటుల పర్ఫార్మెన్స్
  • రియాలిటీకి దగ్గరగా ఉన్న స్టోరీ పాయింట్
  • పాటలు
  • డైలాగ్స్

మైనస్ పాయింట్స్:

  • అక్కడక్కడ సాగదీసినట్టుగా ఉన్న కొన్ని ఎపిసోడ్స్
  • సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్

రేటింగ్ :

3.25/5

ట్యాగ్ లైన్ :

మన ఇండస్ట్రీలో ప్రేమ కథలు రావడమే అరుదు. అందులోనూ ఇలాంటి రియాలిటీకి దగ్గరగా ఉండే బోల్డ్ ప్రేమ కథలు రావడం అనేది ఇంకా అరుదు. అందుకే ఎలాంటి అంచనాలు పెట్టుకొని వెళ్లినా కూడా ఈ సినిమా అస్సలు నిరాశ పరచదు. ఇటీవల కాలంలో వచ్చిన సందేశాత్మక ప్రేమ కథా చిత్రాల్లో బెస్ట్ సినిమాల్లో ఒకటిగా బేబీ సినిమా నిలుస్తుంది.

watch trailer : 


End of Article

You may also like